Mahesh Babu : మళ్ళీ ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి మహేష్.. రాజమౌళి సినిమా ఇంకెప్పుడు అంటూ ఫ్యాన్స్..

మహేష్ టైం దొరికితే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్ళిపోతారని తెలిసిందే.

Mahesh Babu : మళ్ళీ ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి మహేష్.. రాజమౌళి సినిమా ఇంకెప్పుడు అంటూ ఫ్యాన్స్..

Mahesh Babu Went To Vacation Fans Asking about Rajamouli SSMB29 Film

Updated On : March 23, 2024 / 2:52 PM IST

Mahesh Babu : మహేష్ బాబు త్వరలో రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి మహేష్ బాబు కాంబోలో SSMB29 సినిమా రాబోతుంది. అసలు ఈ సినిమా మొదలు కూడా కాక ముందే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. దీంతో షూట్ ఎప్పుడు మొదలుపెడతారు అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇక మహేష్ టైం దొరికితే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్ళిపోతారని తెలిసిందే. కుదిరితే నెలకి ఒకసారి మహేష్ ఫ్యామిలీ వెకేషన్ కి వెళ్తారు. తాజాగా మరోసారి మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. నేడు ఉదయం మహేష్ బాబు, సితార, గౌతమ్, నమ్రత కలిసి వెళ్తూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనపడ్డారు. దీంతో ఈ విజువల్స్ వైరల్ గా మారాయి.

Also Read : Kalki 2898 AD : కల్కి వాయిదా కన్ఫార్మ్.. ఎన్నికలు మాత్రమే కాదు విఎఫెక్స్ వర్క్ కూడా..

అయితే మరోసారి మహేష్ ఫ్యామిలితో కలిసి వెకేషన్ కి వెళ్తుండటంతో రాజమౌళి సినిమా ఇంకెప్పుడు మొదలుపెడతారు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక కొంతమంది అయితే రాజమౌళి సినిమా మొదలైతే అసలు వెకేషన్ కి వెళ్లే టైం కూడా ఉండదు, అందుకే ఇప్పుడే వెకేషన్స్ కి వెళ్తున్నారు అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రాజమౌళి మహేష్ SSMB29 సినిమా కోసం అంతా ఎదురుచూస్తుంటే మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లడం చర్చగా మారింది.