Kalki 2898 AD : కల్కి వాయిదా కన్ఫార్మ్.. ఎన్నికలు మాత్రమే కాదు విఎఫెక్స్ వర్క్ కూడా..

కల్కి వాయిదా కన్ఫార్మ్ అంటుంది ఫిలిం నగర్. అయితే ఆ పోస్టుపోన్ కి కారణం ఎన్నికలు మాత్రమే కాదు విఎఫెక్స్ వర్క్ కూడా..

Kalki 2898 AD : కల్కి వాయిదా కన్ఫార్మ్.. ఎన్నికలు మాత్రమే కాదు విఎఫెక్స్ వర్క్ కూడా..

Prabhas Kalki 2898 AD movie VFX is still pending

Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఓ సాంగ్ షూట్ కోసం ఇటలీ వెళ్లిన చిత్ర యూనిట్.. అక్కడి షెడ్యూల్ ని పూర్తి చేసుకొని తిరిగి వచ్చింది. అయితే ఈ మూవీ రిలీజ్ పై ప్రస్తుతం సస్పెన్స్ నెలకుంది. మే 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు.

అయితే అదే సమయంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలకు తేదీ ఫిక్స్ చేశారు. రాజకీయ ప్రచారాలు, పోలింగ్ వల్ల సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాదు, పార్లమెంట్ ఎన్నికల వల్ల పాన్ ఇండియా మార్కెట్, టికెట్ హైక్ తెచ్చుకోలేని విషయాలు కూడా సినిమా లాస్ కి కారణం అవుతుంది. దీంతో ఈ మూవీ పోస్టుపోన్ అవ్వడం గ్యారంటీ అని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపించాయి.

Also read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ముద్దుల కూతురు క్యూట్ వీడియో చూశారా..!

అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ మూవీ వాయిదాకి కేవలం ఎన్నికలు మాత్రమే కాదు, విఎఫెక్స్ కూడా ఒక కారణం కూడా కాబోతుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన లాస్ట్ స్టేజి సిజి వర్క్స్ జరుగుతున్నాయి. వాటి అవుట్ ఫుట్ రీసెంట్ గా మూవీ టీం వద్దకి వచ్చాయట. ఆ అవుట్ ఫుట్ చూసిన మేకర్స్.. సంతృప్తి చెందలేదట. దర్శకనిర్మాతలు అనుకున్న స్థాయిలో సిజి వర్క్ లేదట.

దీంతో చిత్ర యూనిట్ మళ్ళీ సిజి వర్క్ కోసం కొన్ని సీన్స్ ని పంపించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరి ఇప్పుడు వాయిదా పడితే ఈ చిత్రం ఎప్పుడు వస్తుందో అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే, ఈ సినిమా రిలీజ్ తరువాత చాలా ముఖ్యమైన డేట్స్ ని పలు పాన్ ఇండియా సినిమాలు లాక్ చేసుకొని ఉన్నాయి. దీంతో కల్కికి పెద్ద సమస్యే ఎదురైనట్లు తెలుస్తుంది.