Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ముద్దుల కూతురు క్యూట్ వీడియో చూశారా..!

పవన్ కళ్యాణ్ ముద్దుల కూతురు ఆద్య క్యూట్ వీడియో చూశారా. ఆద్య చిన్నప్పటి వీడియోని..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ముద్దుల కూతురు క్యూట్ వీడియో చూశారా..!

Renu Desai shares her daughter Aadhya Konidela cute video

Updated On : March 23, 2024 / 1:44 PM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసులు అకిరా నందన్, ఆద్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమ తండ్రిలా వీరిద్దరూ కూడా సోషల్ మీడియాలో లో ప్రొఫైల్ మెయిన్‌టైన్ చేస్తూ వచ్చినప్పటికీ.. తమ తల్లి రేణూదేశాయ్ వారికీ సంబంధించిన విషయాలను నెట్టింట షేర్ చేస్తూ అభిమానులను ఖుషి చేస్తుంటారు. తాజాగా రేణూదేశాయ్ ఆద్యకి సంబంధించిన ఓ క్యూట్ వీడియోని షేర్ చేశారు.

నేడు మార్చి 23న ఆద్య పుట్టినరోజు. ఈ బర్త్ డేతో ఆద్య పద్నాలుగో ఏటలోకి అడుగు పెడుతుందట. దీంతో ఆద్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. రేణూదేశాయ్ ఆద్య చిన్నప్పటి వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ఆద్య.. క్యూట్ క్యూట్ గా ఐ లవ్ యూ అని చెబుతూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన అభిమానులు.. ఆద్యకి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.

Also read : Tollywood : ‘వజ్రోత్సవం’లా తెలుగు సినిమా 90ఏళ్ళ నవతి ఉత్సవం.. ఎక్కడ.. ఎప్పుడు..?

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

ఇక ఇదే పోస్టులో వచ్చే నెల అకిరా పుట్టినరోజు కూడా ఉన్నట్లు, తాను ఈ ఏడాదితో 20వ ఏటలోకి అడుగు పెడుతున్నట్లు రేణూదేశాయ్ పేర్కొన్నారు. అకిరా పుట్టినరోజు తేదీ ఏప్రిల్ 8. ప్రస్తుతం అకిరా ఫారిన్ లోని ఫిలిం స్కూల్ లో తన ఎడ్యుకేషన్ ని చేస్తున్నాడు. పవన్ అభిమానులంతా అకిరా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అకిరా ఎంట్రీ హీరోగా ఉంటుందా..? మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటుందా..? అనేది ప్రశ్నగా మారింది.

ఎందుకంటే, అకిరా ప్రస్తుతం మ్యూజిక్ పైనే ఇంటరెస్ట్ చూపిస్తున్నాడని, యాక్టింగ్ పై పెద్ద ఆసక్తి చూపడం లేదని రేణూదేశాయ్ చెప్పుకొస్తున్నారు. ప్రెజెంట్ అకిరా కూడా ఫిలిం స్కూల్ లో మ్యూజిక్ కోర్స్ లోనే శిక్షణ పొందుతూ వస్తున్నాడు. మరి భవిషత్తులో అకిరా ఎటువైపు అడుగులు వేస్తాడో చూడాలి.