Tollywood : ‘వజ్రోత్సవం’లా తెలుగు సినిమా 90ఏళ్ళ నవతిహి ఉత్సవం.. ఎక్కడ.. ఎప్పుడు..?

'వజ్రోత్సవం' లాంటి ఓ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ ఆడియన్స్ కి గుడ్ న్యూస్. 90ఏళ్ళ తెలుగు సినిమా ఈవెంట్‌ని..

Tollywood : ‘వజ్రోత్సవం’లా తెలుగు సినిమా 90ఏళ్ళ నవతిహి ఉత్సవం.. ఎక్కడ.. ఎప్పుడు..?

Maa Association president Manchu Vishnu conducting 90 years of telugu cinema event

Tollywood : ప్రస్తుతం తెలుగు సినిమా హవా నడుస్తుంది. ఒకప్పుడు నేషనల్ లెవెల్ లో కూడా గుర్తింపు లేని మన తెలుగు చిత్రాలకు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆదరణ లభిస్తుంది. తెలుగు సినిమాల కోసం నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. 90ఏళ్ళ సినిమా చరిత్రలో ప్రస్తుతం తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని చూస్తుంది.

ఇక ఈ గోల్డెన్ ఎరాని సెలబ్రేట్ చేసుకోవడం కోసం టాలీవుడ్ ‘మా’ అసోసియేషన్ ముందడుగు వేస్తుంది. టాలీవుడ్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆధ్వర్యంలో నేడు ’90 ఏళ్ళ తెలుగు సినిమా’ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో మా కార్యవర్గ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Also read : Ram Charan : రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా.. రాబోయే సినిమా బహుమతులు ఇవే..

ఈ కార్యక్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ.. “రెండేళ్ల క్రితమే 90ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్ ని చేయాలని అనుకున్నాము. కానీ అలాంటి చారిత్రాత్మక ఈవెంట్ ని చేస్తే గొప్పగా, సక్సెస్‌ఫుల్ గా నిర్వహించాలని భావించాము. అందుకు సరైన సమయం కోసం ఇన్నాళ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు తెలుగు సినిమాకు గొల్డెన్ ఎరా నడుస్తొంది.

మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్, కీరవాణి-చంద్రబోస్ గారికి ఆస్కార్, అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ రావటం, ఇండియన్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ప్రభాస్ ఎదగడం, మహేష్ రాజమౌళి సినిమా ఏషియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా రాబోతుండడం, ముఖ్యంగా మన జై బాలయ్య అనే మాట ఎంతో పాపులారిటీ సంపాదించుకోవడం.. ఇలా తెలుగు సినిమా సౌండ్ ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ అవుతూ వస్తుంది.

అంతేకాదు అమితాబ్ బచ్చన్, అనీల్ కపూర్ వంటి నటులను తెలుగువారే పరిచయం చేశారు. అందుకే 90ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్ ని ఇప్పుడు చేయడం కరెక్ట్ అని మేము భావిస్తున్నాము. అందుకనే మలేషియాలో ‘నవతిహి’ పేరిట చారిత్రాత్మక ఈవెంట్ ని చేయాలని మా అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నాము. ఈ విషయం గురించి ఫిలిం ఛాంబర్ తో కూడా మాట్లాడడం.

టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు రోజులు సెలవులు ఇవ్వాలని కోరాము. దిల్ రాజు, దాము గారిని ఇందుకు సపోర్ట్ చేయాలని విన్నవించుకున్నాము. ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి కూడా ఈ ఈవెంట్ కి సపోర్ట్ వస్తుంది. వారు పాల్గొంటామని తమ సపోర్ట్ ని తెలియజేస్తున్నారు. జులైలో ఈ ఈవెంట్ ని నిర్వహించాలని భావిస్తున్నాము. పరిశ్రమ పెద్దలను సంప్రదించి ఈవెంట్ డేట్స్ ని అనౌన్స్ చేస్తాము. తెలుగు సినిమా ఘనకీర్తిని తెలిపేలా ఈ ఈవెంట్ ను చేస్తాము” అంటూ చెప్పుకొచ్చారు.

కాగా గతంలో ‘వజ్రోత్సవం’ ఈవెంట్ ని తెలుగు సినిమా పరిశ్రమ అంతా కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంది. ఆ ఈవెంట్ లో హీరోలు అంతా కలిసి ఎంజాయ్ చేస్తూనే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఆ వజ్రోత్సవంలోని పలు ఈవెంట్స్ చాలామందికి ఫేవరెట్. మళ్ళీ అలాంటి ఈవెంట్ కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మరి ఈ నవతిహి ఈవెంట్ వజ్రోత్సవాన్ని గుర్తు చేస్తుందో లేదో చూడాలి.