Ram Charan : రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా.. రాబోయే సినిమా బహుమతులు ఇవే..

ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా తన రాబోయే సినిమాల నుంచి ఈ బహుమతులు రాబోతున్నాయట.

Ram Charan : రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా.. రాబోయే సినిమా బహుమతులు ఇవే..

Ram Charan Birthday gifts from his upcoming movies

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈ నెల 27న అన్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ ఏడాది బర్త్ డే సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. అయితే ఫ్యాన్స్ లాగానే మూవీ మేకర్స్ కూడా ఈసారి చరణ్ పుట్టినరోజుని గ్రాండ్ గా నిర్వహించేందుకు సిద్దమవుతున్నారట. ఈక్రమంలోనే అదిరిపోయే అప్డేట్స్ ని రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ బర్త్ డే జోష్ ని రెట్టింపు చేసేందుకు థమన్ ‘జరగండి’ సాంగ్ ని తీసుకు వస్తున్నారు. ఇక ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేసిన RC16 మూవీ నుంచి టైటిల్ అనౌన్స్‌మెంట్ రాబోతుందట. ఈ చిత్రానికి పెద్ది, కలియుగ భీమా అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఏది ఫిక్స్ చేస్తారో చూడాలి.

Also read : Allu Arjun : అల్లు అర్జున్‌కి ఉత్తమనటుడు అవార్డు వస్తే.. చిత్రసీమ సన్మానించలేదు.. మురళీ మోహన్ కామెంట్స్

ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రంగస్థలం’ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ కూడా ఈ బర్త్ డే గిఫ్ట్‌గా రాబోతుందట. రంగస్థలం చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి కూడా నిర్మించబోతున్నారట. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తీ అయిన తరువాత రామ్ చరణ్ పనులు మొదలు పెట్టనున్నారు.

ఆల్రెడీ ఈ సినిమా స్టోరీ వర్క్స్ పూర్తి అయ్యిపోయినట్లు సమాచారం. అంతేకాదు ఈ మూవీలోని రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ని కూడా షూట్ చేసేసారు. ఆర్ఆర్ఆర్ సమయంలోనే సుకుమార్.. ఆ ఇంట్రడక్షన్ సీన్ ని పూర్తి చేసేసినట్లు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ సీక్వెన్స్ ప్రతిఒక్కరికి గూస్‌బంప్స్ తెప్పిస్తుందని జక్కన్న చెప్పుకొచ్చారు. దీంతో ఆ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.