Allu Arjun : అల్లు అర్జున్‌కి ఉత్తమనటుడు అవార్డు వస్తే.. చిత్రసీమ సన్మానించలేదు.. మురళీ మోహన్ కామెంట్స్

అల్లు అర్జున్‌కి ఉత్తమనటుడు అవార్డు వస్తే చిత్రసీమ సన్మానించలేదు ఎందుకని..? అంటూ సీనియర్ నటుడు మురళీ మోహన్ ప్రశ్నిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

Allu Arjun : అల్లు అర్జున్‌కి ఉత్తమనటుడు అవార్డు వస్తే.. చిత్రసీమ సన్మానించలేదు.. మురళీ మోహన్ కామెంట్స్

Senior Actor Murali Mohan comments about Allu Arjun National Award

Updated On : March 23, 2024 / 7:04 AM IST

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. 69 ఏళ్ళగా బెస్ట్ యాక్టర్ అవార్డు అన్నది టాలీవుడ్ కి ఒక తీరని కలలా ఉన్నది. అలాంటి కలని అల్లు అర్జున్ నిజం చేస్తూ తెలుగు సినీ పరిశ్రమకు మొదటి జాతీయ ఉత్తమ నటుడు అవార్డుని తీసుకు వచ్చారు. ఈ విషయంలో అల్లు అర్జున్ ని ప్రతిఒక్కరు అభినందించారు.

అయితే ఎన్నో ఏళ్లగా ఓ కలలా ఉన్న విషయాన్ని నిజం చేసినప్పుడు.. ఆ సందర్భాన్ని, ఆ వ్యక్తిని కొంచెం ప్రత్యేకంగా సత్కరించడం కొంచెం గౌరవంగా ఉంటుంది. అలాంటి ప్రత్యేకత అల్లు అర్జున్ విషయంలో జరగలేదు. ఈ విషయం పై బన్నీ అభిమానులు మాత్రమే ఇండస్ట్రీ వ్యక్తులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా ఈ విషయం గురించి సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

Also read : Jai Hanuman : ‘జై హనుమాన్’ పక్కన పెట్టేసి.. అనుపమతో సినిమా స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ..

నిన్న మార్చి 22న సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాగా మురళీమోహన్, అల్లు అరవింద్ తో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు కూడా పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లోనే మురళీ మోహన్ మాట్లాడుతూ.. “అల్లు అర్జున్‌కి ఉత్తమనటుడు అవార్డు వస్తే చిత్రసీమ సన్మానించలేదు ఎందుకని..? ఇప్పుడు మెగాస్టార్ ని అయినా సన్మానిస్తున్నారు సంతోషం. మేము చెన్నైలో ఉండేటప్పుడు ఇలా ఉండేది కాదు” అంటూ అసహనం వ్యక్తం చేసారు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి చిత్ర నిర్మాతలు, సినీ పెద్దలు ఈ విషయం పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డుతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న సంగతి కూడా తెలిసిందే. మార్చి 28న ఈ విగ్రహాన్ని ఓపెన్ చేయబోతున్నారు.