Ram Charan : కొత్త బిజినెస్‌లోకి గ్లోబల్ స్టార్.. ISPL హైదరాబాద్ టీమ్ చరణ్ దే..

అటు సినిమాలతో పాటు ఇటు స్పోర్ట్స్‌లోకి అడుగుపెట్టారు రామ్ చరణ్. ISPL -T10 లో భాగస్వామి అవుతూ హైదరాబాద్ జట్టుని కొనుగోలు చేసారు.

Ram Charan

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీట్ -T10 లో భాగస్వామిగా మారారు. హైదరాబాద్ జట్టుని కొనుగోలు చేసిన రామ్ చరణ్ స్టోర్ట్స్‌లో కూడా తన సత్తా చాటబోతున్నారు.

Ram Charan : వరల్డ్ టాప్ మ్యాగజైన్‌ ఫోర్బ్స్ ఇండియాలో రామ్ చరణ్ ఉపాసన..

తన నటనతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు సంపాదించుకున్న చెర్రీ ఇప్పుడు స్పోర్ట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. ఐఎస్పీఎల్ లో 10 హైదరాబాద్ జట్టుని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ISPL -T10 లో ఉన్న ఆరు జట్లలో ఇప్పటికే శ్రీనగర్- అక్షయ్ కుమార్, బెంగళూరు- హృతిక్ రోషన్, ముంబయి-అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసారు. తాజాగా హైదరాబాద్ జట్టును రామ్ చరణ్ సొంతం చేసుకోగా.. ఇంకా చెన్నై, కోల్‌కతా యజమానులు తెలియాల్సి ఉంది. ఐఎస్పీఎల్ లో 10 మార్చి 2 న ప్రారంభమవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.

Ram Charan & Upasana : మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేని కలిసిన రామ్ చరణ్, ఉపాసన ఫొటోలు..

టీ 20 లో 20 ఓవర్లు ఉంటాయి. అయితే ఐఎస్పీఎల్‌లో 10లో 10 ఓవర్లు ఉంటాయి. స్ట్రీట్ టూ స్టేడియం అనే స్లోగన్‌తో ఈ ప్లేయర్స్ రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ చేసేసారు. రామ్ చరణ్ టీంతో ఆడాలని తహతహలాడుతున్న ప్లేయర్స్ ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక్కటే మిగిలింది. అటు సినిమాలు ఇటు స్పోర్ట్స్ చెర్రీ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంతవరకూ సక్సెస్ అవుతారో వేచి చూడాలి.