RC16 : రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.. ఓపెనింగ్ అండ్ టైటిల్ అప్డేట్..

రామ్ చరణ్, బుచ్చిబాబు Rc16కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఓపెనింగ్ తో పాటు టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా..

RC16 : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే RC16 కోసం అభిమానులంతా ఏందో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులు అన్నిటికి తెరపడే సమయం ఇప్పుడు వచ్చింది. వ్రిద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం ఓపెనింగ్ అండ్ టైటిల్ ఫిక్స్ అయ్యిందట.

ఈ సినిమాని ఈ నెల 20న హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారట. అదే రోజు టైటిల్ ని కూడా అనౌన్స్ చేయనున్నారట. ఈ సినిమాకి ‘పెద్ది’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. అలాగే ఈ మూవీలో నటించబోయే ఇతర నటీనటుల విషయాలను కూడా అదే రోజున ప్రకటించనున్నారట.

Also read : Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ కోసం వైజాగ్‌కి చరణ్.. ఫ్యాన్స్‌ని చూసి షాక్ అయిన ఎస్‌జె సూర్య..

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. శివ రాజ్ కుమార్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలు నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ తో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల జాతీయ అవార్డు అందుకోవడంతో, సుకుమార్ కూడా ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేక ఆసక్తి చూపిస్తుండడంతో.. ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ న్యూ షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతుంది. ఆ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ షెడ్యూల్ మార్చి 19 వరకు జరగనుంది. ఆ షూటింగ్ పూర్తి చేసుకొని 20వ తారీఖు RC16 ఓపెనింగ్ లో చరణ్ పాల్గొంటారు.

 

 

ట్రెండింగ్ వార్తలు