Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ కోసం వైజాగ్‌కి చరణ్.. ఫ్యాన్స్‌ని చూసి షాక్ అయిన ఎస్‌జె సూర్య..

వైజాగ్‌లో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్. చరణ్ కోసం వచ్చిన ఫ్యాన్స్‌ని చూసి షాక్ అయిన ఎస్‌జె సూర్య. వైరల్ అవుతున్న వీడియో.

Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ కోసం వైజాగ్‌కి చరణ్.. ఫ్యాన్స్‌ని చూసి షాక్ అయిన ఎస్‌జె సూర్య..

Game Changer star Ram Charan fans gone crazy at visakhapatnam airport

Updated On : March 15, 2024 / 8:11 AM IST

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ నేటి (మార్చి 15) నుంచి వైజాగ్ లో జరగనుంది. అక్కడి ఆర్‌కె బీచ్ లో ఐదు రోజుల పాటు కీలక షెడ్యూల్ జరగబోతుంది. ఈక్రమంలోనే బీచ్ పెద్ద పొలిటికల్ మీటింగ్ సెట్ ని కూడా నిర్మించారు. ఇక ఈ షూటింగ్ కోసం మూవీ టీం అంతా నిన్ననే వైజాగ్ చేరుకుంది.

రామ్ చరణ్, శంకర్, ఎస్‌జె సూర్యతో పాటు ఈ షెడ్యూల్ లో పాల్గోవల్సిన మరికొందరు నటీనటులు కూడా వైజాగ్ చేరుకున్నారు. ఇక రామ్ చరణ్ వస్తున్నాడు అని తెలియడంతో.. అభిమానులు సందడి మొదలయింది. నిన్న సాయంత్రం నుంచి వైజాగ్ ఎయిర్ పోర్ట్ వద్ద తమ అభిమాన హీరో కోసం ఎదురు చూపులు చూసారా. దీంతో ఎయిర్ పోర్ట్ అంతా రామ్ చరణ్ అభిమానులతో కోలాహలంగా మారింది.

Also read : RRR : ‘ఆర్ఆర్ఆర్’ ఒక అద్భుతమైన మూవీ.. హాలీవుడ్ పాప్ సింగర్.. జపాన్‌లో ఇంకా తగ్గని క్రేజ్..

జై చరణ్, జై జై చరణ్ అంటూ తెగ గోల చేసేసారు. ఇక ఎయిర్ పోర్ట్ వద్ద రామ్ చరణ్ భారీ అభిమానాన్ని చూసిన ఎస్‌జె సూర్య షాక్ అయ్యారు. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకి వెళ్లకుండా, కాసేపు వచ్చిన భారీ అభిమానులను చూస్తూ అలా నిలుచుండి పోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఈ షెడ్యూల్ షూటింగ్ మార్చి 19 వరకు జరగనుంది.

ఆ తరువాత మార్చి 20న రామ్ చరణ్ హైదరాబాద్ వచ్చి RC16 మూవీని పూజ కార్యక్రమాలతో లాంచ్ చేయబోతున్నారట. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ హైదరాబాద్ లో గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. మే నెల లోపు ఈ మూవీ షూటింగ్ ని పూర్తీ చేసేలా శంకర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ నెల మార్చి 27న చరణ్ పుట్టినరోజు కానుకగా ‘జరగండి’ సాంగ్ రిలీజ్ కాబోతుంది.