Ram Charan : చెన్నైలో ‘గేమ్ ఛేంజర్’ ఎంట్రీ.. భార్య ఉపాసన, కూతురు క్లిన్ కారాతో స్టైలిష్ లుక్‌లో గ్లోబల్ స్టార్..

తాజాగా రామ్ చరణ్ చెన్నైలో అడుగుపెట్టారు.

Ram Charan : రామ్ చరణ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకున్నాడు. RRR తర్వాత ఇప్పుడు మూడు సినిమాలని లైన్లో పెట్టాడు చరణ్. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు ప్రస్తుతం. ఆ తర్వాత బుచ్చిబాబు, సుకుమార్ లతో రెండు సినిమాలని కూడా ప్రకటించాడు.

RRR తో వచ్చిన ఫేమ్ తో ఇప్పటికే రామ్ చరణ్ అనేక గుర్తింపులు సాధించాడు. ఇప్పుడు డాక్టరేట్ కుండా అందుకోబోతున్నాడు. తమిళనాడు చెన్నైకి చెందిన వేల్స్‌ యూనివర్సిటీ(Vels University) రామ్ చరణ్ కు సినిమాల్లో చేసిన సేవలకు గాను గౌరవ డాక్టరేట్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు ఏప్రిల్‌ 13న ఈ యూనివర్సిటీలో జరగబోతున్న స్నాతకోత్సవ కార్యక్రమంలో రామ్ చరణ్ కి డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి చరణ్ తో పాటు పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా రాబోతున్నారు.

Also Read : Manchu Manoj – Mounika : పండంటి పాపకు జన్మనిచ్చిన మంచు మనోజ్ దంపతులు.. మంచు లక్ష్మి స్పెషల్ పోస్ట్..

ఈ కార్యక్రమం కోసం తాజాగా రామ్ చరణ్ చెన్నైలో అడుగుపెట్టారు. కొద్ది సేపటి క్రితమే రామ్ చరణ్, ఉపాసన(Upasana), క్లిన్ కారా చెన్నై విమానాశ్రయంలో దిగారు. చెన్నై విమానాశ్రయంలో రామ్ చరణ్ ఫొటోలు వైరల్ గా మారాయి. చరణ్ ఫొటోలు చూసి ఏం స్టైలిష్ గా ఉన్నాడ్రా బాబు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నేడు సాయంత్రం చెన్నై వేల్ యూనివర్సిటీలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా చరణ్ డాక్టరేట్ అందుకోనున్నారు.

ట్రెండింగ్ వార్తలు