Ram Charan : విజయ్ ‘లియో’లో రామ్ చరణ్ ‘కోబ్రా’గా ఎంట్రీ..?

విజయ్ 'లియో'లో రామ్ చరణ్ క్యామియో ఉంటుందా..? 'కోబ్రా'గా మాస్ ఎంట్రీ ఇస్తున్నాడా..?

Ram Charan entry in Vijay Leo movie as Cobra

Ram Charan – Leo : తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘లియో’. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ ఫై ఆడియన్స్ లో సూపర్ బజ్ ఉంది. ఇక ఈ మూవీలో ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ఉందంటూ గత కొన్ని రోజులుగా తెగ వార్తలు వస్తున్నాయి. లోకేష్ తెరకెక్కించిన గత చిత్రం ‘విక్రమ్’లో సూర్య ఒక మాస్ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చినట్లు.. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ టాక్ వినిపిస్తుంది.

ఈ క్యామియో గురించి గత కొన్ని రోజులుగా నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. ఈక్రమంలోనే కొన్ని అధరాలు కూడా చూపిస్తున్నారు ప్రేక్షకులు. కాశ్మీర్ షెడ్యూల్ లో చిత్రీకరించిన సీన్స్ లో తెలంగాణ రిజిస్టర్ కారు కనిపించదని, అలాగే ఈ సినిమాలో నటిస్తున్న సంజయ్ దత్ కి సంబంధించిన వీడియో రిలీజ్ చేసినప్పుడు.. అందులో చివరిగా వినిపించిన వాయిస్ రామ్ చరణ్‌దే అని అప్పటిలో బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఈ రెండు విషయాలను చూపిస్తూ.. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యామియో కన్ఫార్మ్ అని చెబుతున్నారు.

Also read : Tiger Nageswara Rao : ‘ఇచ్చేసుకుంటాలే’ లిరికల్ సింగల్ రిలీజ్.. సినిమాలో ప్రతి పాత్ర రియల్ అంట..

ఇక ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ఇదే వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ‘కోబ్రా’గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఈ క్యామియో 10-20 నిముషాలు పాటు ఉండబోతుందని చెబుతున్నారు. ఇక పలు టికెట్ వెబ్ సైట్స్ కూడా మూవీ క్యాస్టింగ్ లిస్ట్ లో రామ్ చరణ్ పేరుని చూపిస్తుండడంతో.. సోషల్ మీడియా అంతా రామ్ చరణ్, లియో హాష్ ట్యాగ్స్ తో ట్రేండింగ్ లో ఉన్నాయి. మరి ఈ సినిమాలో చరణ్ ఎంట్రీ ఉంటుందా..? లేదా..? అనేది తెలియాలంటే రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే.