Game Changer : ఊరూరా ‘గేమ్ ఛేంజర్’ టీజర్ సెలబ్రేషన్స్.. రామ్ చరణ్ ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్స్.. వీడియోలు వైరల్..

టీజర్ దేశంలోని 11 నగరాల్లో 11 థియేటర్స్ లో కూడా ప్లే చేస్తుండటంతో ఆ థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో చేస్తున్నారు.

Ram Charan Fans Mass Celebrations for Game Changer Teaser in Theaters Videos goes Viral

Game Changer : మూడేళ్ళుగా ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ కు ఇవాళ ట్రీట్ రానుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ నేడు సాయంత్రం రిలీజ్ 6 గంటలకు రిలీజ్ కానుంది. టీజర్ లాంచ్ ఈవెంట్ ను లక్నోలో గ్రాండ్ గా ఏర్పాటు చేసారు. మూవీ టీమ్ అంతా ఇప్పటికే లక్నో చేరుకున్నారు. నిన్న రాత్రే గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమో అని చిన్న వీడియో రిలీజ్ చేయడంతో టీజర్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Dil Raju Son : గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో దిల్ రాజు కొడుకు.. అన్వయ్ అప్పుడే ఎంత పెద్దోడు అయిపోయాడో..

అంతా గేమ్ ఛేంజర్ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే టీజర్ దేశంలోని 11 నగరాల్లో 11 థియేటర్స్ లో కూడా ప్లే చేస్తుండటంతో ఆ థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో చేస్తున్నారు. బ్యానర్స్, కటౌట్స్ తో, టపాకాయలు కాలుస్తూ, రామ్ చరణ్ స్లొగన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. భారీగా ఫ్యాన్స్ థియేటర్స్ వద్దకి వచ్చి రచ్చ చేస్తున్నారు. దీంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ చేసే హంగామా వీడియోలు వైరల్ గా మారాయి. ఇవి చూసి చరణ్ ఫ్యాన్స్ టీజర్ కే ఈ రేంజ్ మాస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారంటే ఇక సినిమాకు, ట్రైలర్ లాంచ్ కు ఇంకెంత చేస్తారో అని భావిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ టీజర్ ను హైదరాబాద్ – సుదర్శన్ థియేటర్, వైజాగ్ – సంగం శరత్, రాజమండ్రి – శివజ్యోతి, విజయవాడ – శైలజ, కర్నూల్ – V మెగా, నెల్లూరు – S2 థియేటర్, బెంగళూరు – ఊర్వశి థియేటర్, అనంతపూర్ – త్రివేణి, తిరుపతి – PGR, ఖమ్మం – SVC శ్రీ తిరుమల, లక్నో – ప్రతిభ థియేటర్స్ లో ప్లే చేస్తున్నారు. ఈ థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ ఆల్రెడీ షురూ అయిపోయింది.