Dil Raju Son : గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో దిల్ రాజు కొడుకు.. అన్వయ్ అప్పుడే ఎంత పెద్దోడు అయిపోయాడో..

గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ లక్నోలో జరుగుతుంది. ఈ ఈవెంట్ కు దిల్ రాజు తన భార్య, కొడుకు అన్వయ్ తో కలిసి బయలుదేరాడు.

Dil Raju Son : గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో దిల్ రాజు కొడుకు.. అన్వయ్ అప్పుడే ఎంత పెద్దోడు అయిపోయాడో..

Dil Raju Son Anvay in Game Changer Promotions Airport Visuals goes Viral

Updated On : November 9, 2024 / 4:38 PM IST

Dil Raju Son : దిల్ రాజు కరోనా లాక్ డౌన్ సమయంలో తన దూరపు బంధువు తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. గతేడాది దిల్ రాజు తనయుడు అన్వయ్ మొదటి పుట్టిన రోజుని సినీ సెలబ్రిటీలను పిలిచి ఘనంగా చేసారు. ఇప్పటివరకు రెండు మూడు సార్లే అన్వయ్ ఫోటోలు బయటకు వచ్చాయి. తాజాగా నేడు దిల్ రాజు కొడుకు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read : Chiranjeevi : లక్కీ భాస్కర్ హిట్.. పిలిచి మరీ వెంకీ అట్లూరిని అభినందించిన మెగాస్టార్.. వెంకీ ఎమోషనల్ పోస్ట్..

నేడు గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ లక్నోలో జరుగుతుంది. ఈ ఈవెంట్ కు దిల్ రాజు తన భార్య, కొడుకు అన్వయ్ తో కలిసి బయలుదేరాడు. దీంతో ఎయిర్ పోర్ట్ లో వీరి విజువల్స్ వైరల్ గా మారాయి. దిల్ రాజు కొడుకు ఇలా బయట కనపడటంతో అన్వయ్ బాగా ఫోకస్ అయ్యాడు. క్యూట్ గా అల్లరి చేస్తూ, ఎయిర్ పోర్ట్ లో తిరుగుతూ కెమెరాల కంట పడ్డాడు. కెమెరాల వైపు చూసి నమస్కారం పెట్టమని దిల్ రాజు కూడా చెప్పడంతో క్యూట్ గా హాయ్ చెప్పి నమస్కారం పెట్టాడు అన్వయ్. మీరు కూడా దిల్ రాజు తనయుడిని చూసేయండి..

దీంతో దిల్ రాజు తనయుడు అన్వయ్ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక అన్వయ్ అప్పుడే ఇంత పెద్దోడు అయిపోయాడా, క్యూట్ గా ఉన్నాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.