Dil Raju Son Anvay in Game Changer Promotions Airport Visuals goes Viral
Dil Raju Son : దిల్ రాజు కరోనా లాక్ డౌన్ సమయంలో తన దూరపు బంధువు తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. గతేడాది దిల్ రాజు తనయుడు అన్వయ్ మొదటి పుట్టిన రోజుని సినీ సెలబ్రిటీలను పిలిచి ఘనంగా చేసారు. ఇప్పటివరకు రెండు మూడు సార్లే అన్వయ్ ఫోటోలు బయటకు వచ్చాయి. తాజాగా నేడు దిల్ రాజు కొడుకు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
నేడు గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ లక్నోలో జరుగుతుంది. ఈ ఈవెంట్ కు దిల్ రాజు తన భార్య, కొడుకు అన్వయ్ తో కలిసి బయలుదేరాడు. దీంతో ఎయిర్ పోర్ట్ లో వీరి విజువల్స్ వైరల్ గా మారాయి. దిల్ రాజు కొడుకు ఇలా బయట కనపడటంతో అన్వయ్ బాగా ఫోకస్ అయ్యాడు. క్యూట్ గా అల్లరి చేస్తూ, ఎయిర్ పోర్ట్ లో తిరుగుతూ కెమెరాల కంట పడ్డాడు. కెమెరాల వైపు చూసి నమస్కారం పెట్టమని దిల్ రాజు కూడా చెప్పడంతో క్యూట్ గా హాయ్ చెప్పి నమస్కారం పెట్టాడు అన్వయ్. మీరు కూడా దిల్ రాజు తనయుడిని చూసేయండి..
#Dilraju garu and @yoursanjali all set for the big game ahead with #GameChangerTeaser launch today in Lucknow, as they were clicked arriving in the city early today.#GameChanger#GamechangerOnJAN10 🚁 pic.twitter.com/cPtOqBsHJn
— Telugu70mm (@Telugu70mmweb) November 9, 2024
దీంతో దిల్ రాజు తనయుడు అన్వయ్ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక అన్వయ్ అప్పుడే ఇంత పెద్దోడు అయిపోయాడా, క్యూట్ గా ఉన్నాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.