Chiranjeevi : లక్కీ భాస్కర్ హిట్.. పిలిచి మరీ వెంకీ అట్లూరిని అభినందించిన మెగాస్టార్.. వెంకీ ఎమోషనల్ పోస్ట్..

తాజాగా మెగాస్టార్ చిరంజీవి లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరిని పిలిచి మరీ అభినందించారు.

Chiranjeevi : లక్కీ భాస్కర్ హిట్.. పిలిచి మరీ వెంకీ అట్లూరిని అభినందించిన మెగాస్టార్.. వెంకీ ఎమోషనల్ పోస్ట్..

Megastar Chiranjeevi Appreciated Venky AtlurI for Lucky Baskhar Success

Updated On : November 9, 2024 / 4:09 PM IST

Chiranjeevi : దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా బ్యాంకింగ్ నేపథ్యంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమా ఇటీవల దీపావళికి రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. ఇప్పటికే లక్కీ భాస్కర్ సినిమా 77 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అమెరికాలో కూడా 1 మిలియన్ మార్క్ దాటింది. సినిమాలో ఎక్కడా కూడా తప్పులు చూపించలేనంత పర్ఫెక్ట్ గా తెరకెక్కించి వెంకీ అట్లూరి ప్రేక్షకులను మెప్పించాడు.

Also Read : Game Changer Teaser : ‘గేమ్ ఛేంజర్’ కొత్త పోస్టర్.. స్పీకర్ పట్టిన చరణ్.. టీజర్ ఎన్నింటికి వస్తుంది? ఏ ఛానల్ లో చూడాలి?

1980 – 90 సమయంలో బ్యాంకింగ్ వ్యవస్థను ప్రేక్షకులకు ఈజీగా అర్థమయ్యేలా చూపించి మంచి స్క్రీన్ ప్లేతో లక్కీ భాస్కర్ ని అందరికి కనెక్ట్ అయ్యేలా చేసారు. ఇప్పటికే లక్కీ భాస్కర్ పై ప్రశంసలు వస్తున్నాయి. అందరూ మూవీ టీమ్ ని అభినందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరిని పిలిచి మరీ అభినందించారు. వెంకీకి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించి కాసేపు సినిమా గురించి మాట్లాడారు.

దీంతో మెగాస్టార్ తో దిగిన ఫోటో వెంకీ అట్లూరి తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. లక్కీ భాస్కర్ కు అభినందించినందుకు థ్యాంక్యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి సర్. మ్యాట్నీ ఐడల్, ఒకప్పుడు నేను ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు చూసిన హీరో ఇవాళ నా సినిమా చూసి నన్ను పిలిచి అభినందించడం ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. సినిమాపై మీ ప్రేమ అందరికి ప్రేరణగా నిలుస్తుంది అని ఎమోషనల్ పోస్ట్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవ్వగా మెగాస్టార్ పిలిచి మరీ అభినందించినందుకు వెంకీ అట్లూరికి కంగ్రాట్స్ చెప్తున్నారు.

View this post on Instagram

A post shared by Venkyatluri (@venky_atluri)