Game Changer Teaser : ‘గేమ్ ఛేంజర్’ కొత్త పోస్టర్.. స్పీకర్ పట్టిన చరణ్.. టీజర్ ఎన్నింటికి వస్తుంది? ఏ ఛానల్ లో చూడాలి?

తాజాగా గేమ్ ఛేంజర్ టీజర్ టైం అనౌన్స్ చేసారు. టీజర్ ఎన్నింటికి వస్తుందో చెప్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

Game Changer Teaser : ‘గేమ్ ఛేంజర్’ కొత్త పోస్టర్.. స్పీకర్ పట్టిన చరణ్.. టీజర్ ఎన్నింటికి వస్తుంది? ఏ ఛానల్ లో చూడాలి?

Ram Charan Game Changer Movie Teaser Time Announced with New Poster

Updated On : November 9, 2024 / 3:42 PM IST

Game Changer Teaser : నేడు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానుంది. మూడేళ్ళుగా ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ కు ఇవాళ అసలైన ట్రీట్ ఇవ్వనున్నారు. ఇప్పటికే రెండు పాటలు, పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా నిన్న రాత్రి టీజర్ ప్రోమో అని చిన్న వీడియో రిలీజ్ చేసారు. ఇక నేడు టీజర్ లాంచ్ ఈవెంట్ లక్నో లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూవీ టీమ్ లక్నోకు చేరుకుంది.

Also Read : Bunny Vasu : ఎంత గొప్ప రచయిత అయినా ఈ క్లైమాక్స్‌ ఊహిస్తే మీరు దేవుళ్లతో సమానం.. ‘క’ సినిమాపై బన్నీ వాసు ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా గేమ్ ఛేంజర్ టీజర్ టైం అనౌన్స్ చేసారు. టీజర్ ఎన్నింటికి వస్తుందో చెప్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఇందులో చరణ్ పొలిటికల్ సూట్ లో స్పీకర్ పట్టుకొని నిల్చున్నాడు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇక గేమ్ ఛేంజర్ టీజర్ నేడు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. తెలుగు టీజర్ దిల్ రాజు యూట్యూబ్ ఛానల్ లో, తమిళ్ టీజర్ సరిగమ తమిళ్ ఛానల్ లో, హిందీ టీజర్ జీ స్టూడియోస్ ఛానల్ లో రిలీజ్ చేయనున్నారు. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా గేమ్ ఛేంజర్ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.

 

Image