Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో రామ్ చరణ్ పాత్ర పేరేంటో తెలుసా?

గేమ్ ఛేంజర్ ఈ సినిమాలో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో రాజకీయ నాయకుడిగా, ప్రస్తుతం IAS ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

Ram Charan Game Changer Movie IAS Officer Character Name goes Viral

Ram Charan : శంకర్ – రామ్ చరణ్ కాంబోలో రాబోయే గేమ్ ఛేంజర్ సినిమాపై అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ప్రాజెక్టు మొదలయి మూడేళ్లు అవుతున్నా సినిమా రిలీజ్ కాదు కదా కనీసం ఒక్క అప్డేట్ కూడా లేదు. ఇప్పటివరకు ఒక పోస్టర్, సాంగ్ తప్ప గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇంకే కంటెంట్ రాలేదు. తాజాగా గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ పాత్ర షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఇంకో వారం రోజులు షూట్ చేస్తే మూవీ షూటింగ్ కూడా అయిపోతుందని తెలుస్తుంది.

అయితే సినిమా ఎంత లేట్ అయినా గేమ్ ఛేంజర్ సినిమాపై బాగానే అంచనాలు ఉన్నాయి. శంకర్ డైరెక్టర్ కావడం, రామ్ చరణ్ రెండు పాత్రలో కనిపించడం, చరణ్ పొలిటికల్ లీడర్ గా కూడా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Also Read : Sekhar Master : ఢీ షోలో ఏడ్చేసిన శేఖర్ మాస్టర్.. మాకు డ్యాన్స్ తప్ప ఏం రాదు..

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో రాజకీయ నాయకుడిగా, ప్రస్తుతం IAS ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ IAS ఆఫీసర్ గా చేసే పాత్ర పేరు వైరల్ గా మారింది. ఇందులో చరణ్ పాత్ర పేరు ‘రామ్ నందన్’ అని సమాచారం. ఈ విషయం తెలిసి IAS ఆఫీసర్ పాత్రకి బాగానే సూట్ అయింది, పేరు క్లాస్ గానే ఉంది అని అంటున్నారు అభిమానులు. మరి ఫ్లాష్ బ్యాక్ లో ఉండే పొలిటికల్ లీడర్ కి ఏం పేరు పెట్టారో అని ఆలోచిస్తున్నారు. ఇక ఈ సినిమా నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.