Game Changer Song : ‘గేమ్ ఛేంజర్’ మూడో సాంగ్ వచ్చేసింది.. ‘నానా హైరానా..’ మెలోడీ పాట అదిరిందిగా..

తాజాగా నేడు 'గేమ్ ఛేంజర్' మూడో పాట రిలీజ్ చేసారు.

Ram Charan Game Changer Movie Third Song Released

Game Changer Song : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ కాబోతుంది. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే మరో పక్క మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రెండు మాస్ పాటలు, టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. తాజాగా నేడు మూడో పాట రిలీజ్ చేసారు.

‘నానా హైరానా.. ప్రియమైన హైరానా..’ అంటూ ఈ మెలోడీ సాంగ్ సాగింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో శ్రేయ గోషాల్, కార్తీక్ పాడారు. ఈ పాట విజువల్స్ చూస్తుంటే చాలా రోజుల తర్వాత డైరెక్టర్ శంకర్ తను పాటల్లో చూపించే గ్రాండ్ విజువల్స్ మళ్ళీ ఈ పాటలో చూపించినట్టు తెలుస్తుంది. మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ వినేయండి..

ఇక ఈ సాంగ్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా తమన్ చాలా రోజుల తర్వాత ఒక మంచి మెలోడీ సాంగ్ ఇచ్చాడని ఫ్యాన్స్ అంటున్నారు. విజవల్స్ పరంగా కూడా ఈ సాంగ్ చాలా గ్రాండ్ గా ఉండబోతుంది.