Ram Charan Game Changer
Game Changer Song : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా జంటగా దిల్ రాజు నిర్మాణంలో భారీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా అంజలి, సునీల్, సముద్రఖని, SJ సూర్య.. పలువురు స్టార్స్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రెండు పాటలు, టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా మూడో పాట అప్డేట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ నుంచి మూడో పాటను నవంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. చరణ్, కియారా కలర్ ఫుల్ గా ఉన్న ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన రెండు పాటలు మాస్ ఆడియన్స్ ని మెప్పించగా ఇప్పుడు మెలోడీ పాట ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
Love shall take a purple cover, this November! 💜💜
The third single from #GameChanger dropping on Nov 28th! ☺️#GameChangerOnJAN10 🚁#GameChangerThirdSingle pic.twitter.com/9zSmPlCBEB
— Game Changer (@GameChangerOffl) November 24, 2024