Vijay – Rashmika : మరోసారి విజయ్, రష్మిక ఔటింగ్.. ఫొటో వైరల్.. ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేయండి అంటున్న ఫ్యాన్స్..

తాజాగా విజయ్, రష్మిక ఔటింగ్ కి వెళ్లినట్టు తెలుస్తుంది.

Vijay – Rashmika : మరోసారి విజయ్, రష్మిక ఔటింగ్.. ఫొటో వైరల్.. ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేయండి అంటున్న ఫ్యాన్స్..

Vijay Deverakonda Rashmika Going Out and Eating at Restaurant Photo goes Viral

Updated On : November 24, 2024 / 10:33 AM IST

Vijay – Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. విజయ్, రష్మిక కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఈ పెయిర్ కి బోలెడంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక ఇద్దరు కలిసి గతంలో వెకేషన్ కి వెళ్లిన ఫోటోలు, రష్మిక విజయ్ ఇంట్లో పండగలను సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటోలు లీక్ అవుతూనే ఉన్నాయి.

దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు వీరిద్దరి మధ్య ఏదో ఉందని భావించారు. గతంలో ఓ సారి వీరిద్దరూ జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఇటీవల రష్మిక విజయ్ ఇంట్లో దీపావళి సెలబ్రేట్ చేసుకొని ఫోటోలు షేర్ చేసి, ఫోటోలు తీసింది ఆనంద్ దేవరకొండ అని కూడా చెప్పింది. దీంతో మళ్ళీ విజయ్ – రష్మిక ల మధ్య ఏదో ఉందని వార్తలు వైరల్ అయ్యాయి.

Also Read : Kalki Part 2 : కల్కి 2 పై అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు.. కల్కి పార్ట్ 1 విదేశాల్లో రిలీజ్ చేస్తాం..

తాజాగా విజయ్, రష్మిక ఔటింగ్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. ఓ రెస్టారెంట్ లో విజయ్, రష్మిక తింటుండగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి తోడు ఇటీవలే విజయ్ ఓ ఇంటర్వ్యూలో.. నేను సింగిల్ గా లేను అని చెప్పడంతో విజయ్, రష్మిక నిజంగానే ప్రేమలో ఉన్నారని అంటున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే ఏదో ఒకటి తొందరగా క్లారిటీ ఇవ్వండి అంటూ వారిద్దరి ఫోటోలు షేర్ చేస్తున్నారు. మరి విజయ్ – రష్మిక నిజంగానే ప్రేమలో ఉన్నారా? డేటింగ్ లో ఉన్నారా తెలియాలంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అధికారికంగా చెప్పాల్సిందే. అప్పటిదాకా ఈ రూమర్స్ తప్పవు.

Image