Ram Charan Hints On Hollywood Project Soon
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆస్కార్ అవార్డు కోసం అమెరికాలో సందడి చేస్తున్నాడు. ఇప్పటికే చిత్ర యూనిట్‌తో కలిసి పలు ఇంటర్వ్యూల్లో చరణ్ చేసిన హంగామా అక్కడి అభిమానులను థ్రిల్ చేస్తోంది. ఇక వరుసగా హాలీవుడ్ మీడియాతో ముచ్చటిస్తూ చరణ్ అందరి చూపులు తనవైపుకు తిప్పుకుంటున్నాడు. తాజాగా ‘టాక్ ఈజీ’ అనే పోడ్‌కాస్ట్‌లో చరణ్ మాట్లాడాడు.
Ram Charan : అల్లు అర్జున్ నో చెప్పిన రోల్ కి చరణ్? మరో బాలీవుడ్ సినిమాలో చరణ్ గెస్ట్ రోల్..
ఈ పోడ్‌కాస్ట్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన చాలా విషయాలను చరణ్ అభిమానులతో పంచుకున్నాడు. అంతేగాక, ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ రావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడని ఆయన ఈ సందర్భంగా తెలిపాడు. ఇక తన నెక్ట్స్ ప్రాజెక్టులపై కూడా చరణ్ ఓ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న చరణ్, అభిమానులకు ఈ సందర్భంగా ఓ అదిరిపోయే న్యూస్ వినిపించాడు. తనను పలు హాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్‌లు కలుస్తున్నాయని.. అక్కడ వర్క్ చేయాల్సిందిగా తనను కోరుతున్నాయని చరణ్ అన్నాడు.
Ram Charan : నేను ఆస్కార్ కోసం వెళ్లడం లేదు.. వాళ్ళ కోసమే వెళ్తున్నాను.. రామ్‌చరణ్!
అంతేగాక, తన హాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి అభిమానులు త్వరలోనే వార్త వినే అవకాశం ఉందని క్లూ ఇచ్చాడు ఈ స్టార్ హీరో. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో కోసం హాలీవుడ్ సంస్థలు క్యూ కడుతుండటంతో, చరణ్ త్వరలోనే గ్లోబల్ స్టార్ అనే బిరుదును నిజం చేయబోతున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.