Ram Charan : నేను ఆస్కార్ కోసం వెళ్లడం లేదు.. వాళ్ళ కోసమే వెళ్తున్నాను.. రామ్‌చరణ్!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో వరుసగా అరుదైన గౌరవాలు దక్కించుకుంటున్నాడు. తాజాగా మరో పాపులర్ అమెరికన్ టాక్ షోకి కూడా ఫస్ట్ ఇండియన్ గెస్ట్ గా హాజరయ్యాడు. ‘ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్’ అనే టాక్ షోలో పాల్గొన్న రామ్ చరణ్..

Ram Charan says he just want to go oscars to see Cate Blanchett, Tom Cruise
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో వరుసగా అరుదైన గౌరవాలు దక్కించుకుంటున్నాడు. HCA అవార్డ్స్ కి ప్రెజెంటర్‌గా, గుడ్ మార్నింగ్ అమెరికాకి గెస్ట్‌గా.. ఇలా పలు ప్రముఖ పాపులర్ వేదికల పైకి ఆహ్వానం అందుకున్న మొదటి ఇండియన్ గా రామ్ చరణ్ చరిత్ర సృష్టిస్తున్నాడు. తాజాగా మరో పాపులర్ అమెరికన్ టాక్ షోకి కూడా ఫస్ట్ ఇండియన్ గెస్ట్ గా హాజరయ్యాడు. ‘ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్’ అనే టాక్ షోలో పాల్గొన్న రామ్ చరణ్.. పలు ఆసక్తికర విషయాలను హాలీవుడ్ ప్రేక్షకులతో పంచుకున్నాడు.
Ram Charan : మరో పాపులర్ అమెరికన్ టాక్ షోకి రామ్‌చరణ్.. రాజమౌళి పై ఎమోషనల్ కామెంట్స్!
ఈ క్రమంలోనే ఆస్కార్ అందుకోడానికి మీరు రెడీగా ఉన్నారా? అని విలేకరి అడిగిన ప్రశ్నకి రామ్ చరణ్ బదులిస్తూ.. నాకే తెలియదు నేను సిద్ధంగా ఉన్నానా? లేదని? ఎందుకంటే నాకు కొంచెం భయం గాను, ఆసక్తి గాను ఉంది. నేను ఆస్కార్ కి ఒక యాక్టర్ గా వెళ్లడం లేదు, ఒక ఫ్యాన్ బాయ్ గా వెళ్తున్నాను అంటూ బదులిచ్చాడు. ఇది విన్న విలేకరి.. ఆస్కార్ వేడుకకు ఎంతోమంది వస్తున్నారు, ఎవర్ని చూడడానికి మీరు ఎదురు చూస్తున్నారు అని ప్రశ్నించింది.
దీనికి రామ్ చరణ్ బదులిస్తూ.. ”అక్కడికి వచ్చే ప్రతి ఒక్కర్ని చూడడానికి. అయితే కేట్ బ్లాంచెట్ అండ్ టామ్ క్రూజ్ ని మాత్రం కచ్చితంగా చూడాలని అనుకుంటున్నా” అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా మార్చి 12 రాత్రి ఆస్కార్ అవార్డుల పురస్కారం జరగనుంది. ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం గం.5:30 నిముషాలకు ఆస్కార్ వేడుక మొదలు కానుంది. ఈ కార్యక్రమాని ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
#RamCharan is the first indian actor to appear on Popular @etnow show ❤️?#GlobalStarRamCharan pic.twitter.com/GCzX4R5NIw
— RAMBO ™ (@RcStan_) March 8, 2023