Ram Charan Interesting Comments on Pawan Kalyan in Game Changer Pre Release Event
Ram Charan : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు రాజమండ్రిలో ఘనంగా జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. బాబాయ్ – అబ్బాయి రావడంతో ఈవెంట్ కు భారీగా మెగా ఫ్యాన్స్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ తో సినిమాపై భారీ హైప్ నెలకొంది. మూవీ యూనిట్ అంతా ఈవెంట్ కు హాజరయ్యారు.
Also See : Game Changer Pre Release Event: పవన్ కళ్యాణ్ ఎంట్రీ అదిరింది.. మీరు చూడండి..
ఈ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. మొదటిసారి ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ చేస్తే ఎంతమంది జనాలు వచ్చారో ఇవాళ అంతే జనాలు వచ్చి జనసంద్రం అయింది. శంకర్ గారు ఈ సినిమాకు గేమ్ ఛేంజర్ అని ఎందుకు పెట్టారో తెలీదు కానీ రియల్ లైఫ్ లో ఏపీలోనే కాదు ఇండియన్ పాలిటిక్స్ లోను రియల్ గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో ఇవాళ పక్కన నిలబడినందుకు, ఆయన కుటుంబంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈ పాత్ర రాసుకున్నారు శంకర్ గారు అని తెలిపారు.
Also Read : Game Changer Ticket Prices : ఏపీలో ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్లు పెంపు.. పుష్ప 2 కంటే తక్కువే..
గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న గ్రాండ్ థియేటరికల్ రిలీజ్ కానుంది. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో భారీగా ఈ సినిమా తెరకెక్కింది. SJ సూర్య, అంజలి, నవీన్ చంద్ర, కియారా అద్వానీ, శ్రీకాంత్, సునీల్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో భారీ హైప్ తెచ్చుకుంది.