Game Changer Ticket Prices : ఏపీలో ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్లు పెంపు.. పుష్ప 2 కంటే తక్కువే..
తాజాగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుతూ, బెనిఫిట్ షోలకు అనుమతులిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది.

Ram Charan Game Changer Ticket Price Hike in AP Details Here
Game Changer Ticket Prices : తెలంగాణలో ఇకపై సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండదని ఇటీవల సంధ్య థియేటర్ ఘటనతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో టాలీవుడ్ నిర్మాతలు నిరాశ చెందారు. కానీ ఏపీలో మాత్రం టికెట్ రేట్ల పెంపుకు బెనిఫిట్ షోలకు అనుమతులకు ఎలాంటి ఢోకా లేదు. తాజాగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుతూ, బెనిఫిట్ షోలకు అనుమతులిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది.
Also Read : Game Changer : హిందీ బిగ్‌బాస్ లో ‘గేమ్ ఛేంజర్’.. రామ్ చరణ్, కియారా అద్వానీ ఆటలు.. ప్రోమో చూశారా?
ఏపీ ప్రభుత్వ జీవో ప్రకారం.. జనవరి 10వ తేదీన ఉదయం 1 గంటకు నిర్వహించే బెనిఫిట్ షో టికెట్ ధర 600 రూపాయలుగా విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే రిలీజ్ రోజు జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇచ్చారు. అదే రోజు ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకు కూడా అనుమతి ఇచ్చారు. జనవరి 10వ తేదీ నుంచి 23 తేదీ వరకు మల్టిప్లెక్స్ లలో అదనంగా 175 రూపాయలు, సింగిల్ థియేటర్లలో 135 రూపాయలు పెంచుకునేలా, అలాగే ఈ రెండు వారాలు అయిదు షోలకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ లెక్కన జనవరి 10న ఉదయం 1 గంట షోకు 600 రూపాయలు టికెట్ ధర, రెండు వారల పాటు మల్టీ ఫ్లెక్స్ లో 352 రూపాయలు, సింగిల్ థియేటర్స్ లో 282 రూపాయలు ఉండనుంది టికెట్ ధర. ఆ తర్వాత మళ్ళీ మాములు రేట్లే ఉండనున్నవి.
అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమా కంటే తక్కువే పెంచారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాకు బెనిఫిట్ షోకు 800 వరకు పెంచుకునేలా, సింగిల్ స్క్రీన్స్ లో 150, మల్టిప్లెక్స్ లో 200 రూపాయలు పెంచుకునేలా అనుమతులిచ్చారు. పుష్పతో పోలిస్తే గేమ్ ఛేంజర్ కి పెంచింది తక్కువే. మరి ఏపీలో గేమ్ ఛేంజర్ ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.