Game Changer : హిందీ బిగ్‌బాస్ లో ‘గేమ్ ఛేంజర్’.. రామ్ చరణ్, కియారా అద్వానీ ఆటలు.. ప్రోమో చూశారా?
హిందీ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ 18 సీజన్ జరుగుతుంది. నేడు శనివారం రానున్న వీకెండ్ ఎపిసోడ్ లో గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, కియారా అద్వానీ రానున్నారు.

Ram Charan and Kiara Advani Game Changer Promotions in Hindi Bigg Boss
Game Changer : రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం ముంబై ఈవెంట్లో పాల్గొన్నారు. కాసేపట్లో రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. గత రెండు రోజులుగా చరణ్ ముంబైలోనే ఉండి అక్కడి ప్రమోషన్స్ లో పాల్గొని పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడ హిందీ బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నారు.
హిందీ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ 18 సీజన్ జరుగుతుంది. నేడు శనివారం రానున్న వీకెండ్ ఎపిసోడ్ లో గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, కియారా అద్వానీ రానున్నారు. నిన్న ఈ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో.. హౌస్ లోకి వెళ్లి అక్కడ కంటెస్టెంట్స్ తో డమ్ చార్డ్స్ గేమ్ ఆడించారు చరణ్, కియారా. అలాగే రోప్ ఫైట్ గేమ్ కూడా కంటెస్టెంట్స్ తో కలిసి ఆడారు.
మీరు కూడా రామ్ చరణ్, కియారా అద్వానీ హిందీ బిగ్ బాస్ ప్రోమో చూసేయండి..
ఇక చరణ్ కి, సల్మాన్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో గాడ్ ఫాదర్ సినిమా సమయంలో సల్మాన్ చరణ్ గురించి తెగ పొగిడాడు. ఇప్పుడు సల్మాన్ హోస్ట్ చేస్తున్న షోకి వెళ్లడంతో వీరిద్దరూ షోలో మంచి సందడి చేశారు అని తెలుస్తుంది. ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే నేడు రాత్రి కలర్స్ ఛానల్ లో వచ్చే హిందీ బిగ్ బాస్ చూడాల్సిందే.
ఇక కాసేపట్లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో ఘనంగా జరగనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈవెంట్ కి హాజరు కానున్నారు. ఇప్పటికే భారీగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.