OG Movie : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ OG అప్డేట్.. ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఈవెంట్ కి రానున్న సుజీత్..
సుజీత్ - పవన్ OG సినిమాపై ఏ రేంజ్ హైప్ ఉందో అందరికి తెలిసిందే.

Pawan Kalyan OG Movie Update in Game Changer Pre Release Event by Director Sujeeth
OG Movie : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు ఏపీ రాజమండ్రిలో భారీగా జరగబోతుంది. మరికొద్ది సేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలవ్వనుంది. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వస్తుండటంతో భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే మెగా అభిమానులు భారీగా ఈవెంట్ కి తరలి వస్తున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక మొదటి సారి సినిమా ఈవెంట్ కి రావడం, అది కూడా చరణ్ ఈవెంట్ కి రావడంతో ఫ్యాన్స్ ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ తో పాటు అంజలి, శ్రీకాంత్, SJ సూర్య, తమన్, దిల్ రాజు.. మూవీ యూనిట్ అంతా హాజరు కానున్నారు. అయితే పవన్ మాత్రమే కాకుండా ఓ స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నాడు. OG డైరెక్టర్ సుజీత్ కూడా గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి హాజరు కాబోతున్నాడు. తమన్, సుజీత్ ఇప్పుడే రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటోలు మూవీ యూనిట్ అధికారికంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
The OG ‘s are on their way to the #MegaPowerEvent ❤️🔥💥
Captain @MusicThaman & Dir #Sujeeth will arrive at the #GameChanger pre release event shortly!✨💥💪🏾#GameChangerOnJan10 🚁 pic.twitter.com/zacjyZ5Smw
— Game Changer (@GameChangerOffl) January 4, 2025
సుజీత్ – పవన్ OG సినిమాపై ఏ రేంజ్ హైప్ ఉందో అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన కంటెంట్ తో వింటేజ్ పవన్ ని చూడబోతున్నాము అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా పవన్ ఏ మీటింగ్ లో పాల్గొన్నా ఆఖరికి పొలిటికల్ మీటింగ్స్ లో కూడా ఫ్యాన్స్ OG OG అని అరుస్తూనే ఉన్నారు. దీనిపై పవన్ కూడా అసహనం వ్యక్తం చేశారు.
Also See : Sakshi Agarwal : బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలు చూశారా?
ఇవాళ పవన్ కళ్యాణ్ రావడం, OG డైరెక్టర్ సుజీత్ కూడా రావడంతో.. ఈవెంట్లో మొత్తం మెగా ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఇవాళ OG OG అని అరుస్తూనే ఉంటారు. అందుకే సుజీత్ తో సినిమా గురించి ఓ చిన్న అప్డేట్ ఇప్పిద్దామని మూవీ యూనిట్ ప్లాన్ లో ఉన్నారట. అప్పటికైనా ఫ్యాన్స్ కాస్త శాంతిస్తారని భావిస్తున్నారు. సుజీత్ వస్తుండటంతో OG గురించి ఏం మాట్లాడతాడో అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.