Thandel Song : తండేల్ నుంచి ‘శివుడి’ సాంగ్ వచ్చేసింది.. చైతు, సాయి పల్లవి స్టెప్స్ అదుర్స్.. ‘నమో నమో నమః శివాయ..’
తాజాగా నేడు తండేల్ సినిమా నుంచి శివుడి సాంగ్ ని రిలీజ్ చేశారు.

Naga Chaitanya Sai Pallavi Thandel Movie Lord Shiva Song Released Video goes Viral
Thandel Song : నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో భారీగా తెరకెక్కుతున్న సినిమా ‘తండేల్’. గీత ఆర్ట్స్ బ్యానర్ పై లో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే తండేల్ సినిమా నుంచి టీజర్, బుజ్జితల్లి సాంగ్ రిలీజ్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.
Also Read : Kiara Advani : కియారా హాస్పిటల్ లో ఉందా? అందుకే గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కి రావట్లేదా?
తాజాగా నేడు తండేల్ సినిమా నుంచి శివుడి సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘నమో నమో నమః శివాయ..’ అంటూ సాగిన శివశక్తి పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ పాటను జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో తెలుగులో అనురాగ్ కులకర్ణి, హరిప్రియ అద్భుతంగా పాడారు. మీరు కూడా ఈ పాట వినేయండి..
హిందీలో దివ్య కుమార్, సలోని థక్కర్ పాడగా, తమిళ్ లో మహా లింగం, హరిప్రియ పాడారు. ఈ సాంగ్ ని తెలుగుతో పారు తమిళ్, హిందీలో రిలీజ్ చేశారు. ఇక ఈ తండేల్ సినిమాని శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారులకు చెందిన రియల్ సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి ప్రభుత్వానికి చిక్కితే అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు అని ఎమోషనల్ దేశభక్తి కంటెంట్ తో ఈ సినిమా రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ తో బిజీగా ఉంది ఈ సినిమా.
Also Read : Govinda wife : గోవిందా భార్య సునీత అహుజా కామెంట్స్ వైరల్.. మేమిద్దం విడివిడిగా జీవిస్తున్నాం..
గతంలో నాగచైతన్య సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు రెండో సారి ఈ ఇద్దరు కలిసి రావడం, చైతు మార్కెట్ కంటే భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తీస్తుండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.