Govinda wife : గోవిందా భార్య సునీత అహుజా కామెంట్స్ వైరల్.. మేమిద్దం విడివిడిగా జీవిస్తున్నాం..
బాలీవుడు నటుడు గోవిందా భార్య సునీతా అహుజా మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Govinda wife Sunita Ahuja implies they live separately
బాలీవుడు నటుడు గోవిందా భార్య సునీతా అహుజా మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తమ పెళ్లి, వైవాహిక బంధం పై అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాము ఇద్దరం ఎక్కువగా విడివిడిగా జీవిస్తున్నామని ఆమె చెప్పింది. సునీత తమ పిల్లలతో కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తుండగా, గోవింద మాత్రం అపార్ట్‌మెంట్ ఎదురుగా ఉన్న బంగ్లాలో ఉంటున్నారని చెప్పింది.
పింక్ విల్లా హిందీ రష్‌తో ఆమె మాట్లాడుతూ.. మాకు రెండు ఇళ్ళు ఉన్నాయి, మా అపార్ట్‌మెంట్ ఎదురుగా మాకు బంగ్లా ఉంది. నా గుడి, నా పిల్లలు ఫ్లాట్‌లో ఉన్నారు. మేము ఫ్లాట్‌లో నివసిస్తున్నాము. అయితే అతను తన సమావేశాల తర్వాత ఆలస్యంగా వస్తాడు. అతను మాట్లాడేందుకు ఇష్టపడతాడు కాబట్టి అతను 10 మందిని సేకరించి వారితో కబుర్లు చెబుతాడు. నేను, నా కొడుకు, నా కుమార్తె కలిసి జీవిస్తున్నాము. కానీ మేము మాట్లాడటం చాలా తక్కువ, ఎందుకంటే మీరు ఎక్కువగా మాట్లాడటం ద్వారా మీ శక్తిని వృధా చేసుకుంటారని నేను భావిస్తున్నాను అని అహుజా అంది.
గోవిందా ఎప్పుడూ పని చేస్తూ ఉంటాడని, రొమాన్స్‌కి సమయం లేదని సునీత తెలిపింది. వచ్చే జన్మంటూ ఉంటే అతడు తనకు భర్తగా వద్దని అతడితోనే చెప్పినట్లు వెల్లడించింది. నేను నా భర్తతో కలిసి బయటకు వెళ్లి వీధుల్లో పానీ-పూరీ తినాలనుకునే వ్యక్తిని. అతను అతడు మాత్రం పని చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తాడు. ఎక్కువగా బయటకు రాడు. మేమిద్దరం కలిసి సినిమా చూడటానికి వెళ్ళిన సందర్భం కూడా నాకు గుర్తు లేదని అంది.
మీ వెనుక ప్రజలు ఏమి చేస్తారో మీకు ఎప్పటికీ తెలియదని, మనిషిని ఎప్పుడూ నమ్మవద్దని చెప్పింది. మనుషులు ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటారని అంది.
Devara 100 Days : ‘దేవర’ 100 డేస్ స్పెషల్ పోస్టర్.. ఎన్ని సెంటర్స్ లో ఆడుతుందో తెలుసా?
1987లో గోవింద, సునీతల పెళ్లి జరిగింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వీరిద్దరు కలిసి జీవిస్తున్నారు. ఈ జంటకు యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.