Ram charan japan fans to come hyderabad to meet him
Ram Charan: హీరోలు, వారి అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఒక్కసారి కూడా కలవకపోయినా హీరోలంటే ప్రాణాలు ఇచ్చే రేంజ్ లో వారిని ఆరాధిస్తారు అభిమానులు. వారి పేరుపై సేవ కార్యక్రమాలు కూడా చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఆ అభిమానం ఖండాతరాలు దాటింది. విదేశాల్లో కూడా మన హీరోలకు ఒక రేంజ్ లో ఫ్యాన్స్ పెరుగుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ని చూడటానికి జపాన్ నుంచి కొంతమంది అభిమానులు హైదరాబాద్ వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ వాటిని తన ఇంటికి రప్పించుకున్నాడు.
Jani Master: డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షురాలిగా జానీ మాస్టర్ భార్య
వారితో కాసేపు సమయాన్ని గడిపాడు. వారి గురించి అడిగి తెలుసుకున్నాడు. అలాగే వారు కూడా మాట్లాడుతూ.. తమకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఆర్ఆర్ఆర్ చూశామని, ఆ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. పెద్ది సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దీంతో వారిని చూసి రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దర్శకుడు బుచ్చిబాబు సనాతో పెద్ది సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన చికిరి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాలు నెలకొన్న పెద్ది సినిమా 2026 మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.