కొరటాల శివ ఆఫీస్‌లో చరణ్

రీసెంట్‌గా దర్శకుడు కొరటాల శివ ఆఫీస్‌కు రామ్‌చరణ్ వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోను రామ్‌చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు..

  • Publish Date - October 18, 2019 / 09:05 AM IST

రీసెంట్‌గా దర్శకుడు కొరటాల శివ ఆఫీస్‌కు రామ్‌చరణ్ వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోను రామ్‌చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు..

ఇటీవల ‘సైరా’తో మంచి విజయం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఇటీవల ఈ సినిమా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

రీసెంట్‌గా దర్శకుడు కొరటాల శివ ఆఫీస్‌కు రామ్‌చరణ్ వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోను రామ్‌చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘అనుకోకుండా కొరటాల శివగారి ఆఫీస్‌కు వెళ్లాను. సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్, ఆయన ఎనర్జీ నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. చిరంజీవి 152వ సినిమాకు ఆల్ ది బెస్ట్’ అని చెర్రీ పోస్ట్ చేశాడు.

Read Also : అందరూ కొత్తవాళ్లతో మైత్రీ మూవీస్ ‘మత్తు వదలరా’

ప్రస్తుతం హీరోయిన్‌తో పాటు ఇతర క్యారెక్టర్స్, టెక్నీషియన్ల సెలక్షన్ జరుగుతోంది. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : సురేష్ స్రాజన్.