Ram Charan: జపాన్ లో తన వీరాభిమానిని కలుసుకున్న రామ్‌చరణ్..

ప్రపంచవ్యాప్తంగా “ఆర్ఆర్ఆర్” సినిమాకు వస్తున్న ఆదరణ చూసి, ఇతర భాషలోకి కూడా అనువదించి విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే జపాన్ లో ఇటీవల విడుదల చేయగా రామ్‌చరణ్..

Ram Charan met his fan in Japan

Ram Charan: రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం “ఆర్ఆర్ఆర్”. విదేశీలు కూడా ఈ సినిమాకి ఫిదా అయిపోతున్నారు. మూవీలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలకి, తారక్-చరణ్ ల నటనకు ప్రశంసలు జల్లు కురుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమాకు వస్తున్న ఆదరణ చూసి, ఇతర భాషలోకి కూడా అనువదించి విడుదల చేస్తున్నారు మేకర్స్.

Trivikram: “చరణ్-బన్నీ”లతో త్రివిక్రమ్ భారీ ముల్టీస్టారర్.. నిజమేనా?

ఈ క్రమంలోనే జపాన్ లో ఇటీవల విడుదల చేయగా.. చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ కోసం ఆ దేశానికీ చేరుకున్నారు. రామ్ చరణ్ నటించిన సినిమాలు జపాన్ లో కూడా విడుదలయ్యి మంచి ప్రజాధారణ పొందడమే కాకుండా, చరణ్ కి అభిమానులను కూడా సంపాదించి పెట్టాయి. తాజాగా ఈ స్టార్ హీరో తన వీరాభిమానిని కలుసుకున్నాడు.

“నోరికో కాసై” అనే ఒక ఆర్టిస్ట్.. రామ్ చరణ్ చిత్రాలను అందంగా చిత్రీకరించి తన అభిమానాన్ని చాటుకుంటుంది. జపాన్ ప్రమోషన్స్ లో ఉన్న చరణ్ ఆమెను కలుసుకుని ఆశ్చర్యపరిచాడు. ఆమెతో సరదాగా ముచ్చటించి, ఫోటోలు దిగి ఆమెను ఆనందపరిచాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.