×
Ad

Ram Charan : ఇంటర్నేషనల్ అవార్డు నామినేషన్స్‌లో రామ్‌చరణ్..

నేషనల్ అవార్డు మిస్ అయినా, తాజాగా ఇంటర్నేషనల్ అవార్డు నామినేషన్స్ లో స్థానం దక్కించుకొని అభిమానులను ఖుషీ చేస్తున్న రామ్ చరణ్.

  • Published On : August 30, 2023 / 11:59 AM IST

Ram Charan nominated in Pop Golden Awards as best actor

Ram Charan : RRR సినిమాతో రామ్ చరణ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో రీచ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. తన యాక్టింగ్ కి హాలీవుడ్ డైరెక్టర్స్, యాక్టర్స్ కూడా ఫిదా అయ్యిపోయారు. ఇక ఆస్కార్ సమయంలో అమెరికాలో రామ్ చరణ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. హాలీవుడ్ లోని టాప్ స్టార్ స్టార్స్ పాల్గొనే టీవీ షోస్, ప్రముఖ అవార్డు వేడుకలో అమెరికన్ యాక్టర్స్ కి తన చేతులు మీదుగా అవార్డులు ఇవ్వడం.. ఇలా హాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా మరో అమెరికన్ అవార్డుల్లో స్థానం దక్కించుకున్నాడు.

Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ సెట్స్ నుంచి వీడియో షేర్ చేసిన అల్లు అర్జున్..

హాలీవుడ్ లో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ (Pop Golden Awards) లో రామ్ చరణ్ బాలీవుడ్ నుంచి నామినేషన్ లో సెలెక్ట్ అయ్యాడు. ఈ అవార్డులు ఇండియాలోని బాలీవుడ్ యాక్టర్స్ అండ్ సినిమాలకు కూడా ఇస్తుంటారు. ఈక్రమంలోనే గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ నామినేషన్స్‌లో.. రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, అదా శర్మ, దీపికా పదుకొనే, రాశి ఖన్నా, రిద్ధి డోగ్రా, విషెస్ బన్సల్, అర్జున్ మాథుర్ సెలెక్ట్ అయ్యారు. గోల్డెన్ బాలీవుడ్ మూవీ క్యాటగిరీలో.. RRR, పఠాన్, రాకెట్ బాయ్స్, కేరళ స్టోరీ, గాన్ గేమ్, కాలేజీ రొమాన్స్, ఫర్జి, అసుర్ నామినేట్ అయ్యాయి.

Allu Arjun : ఈ విషయంలో కూడా అల్లు అర్జున్ మొదటివాడట.. అది ఏంటో తెలుసా..?

ఇక ‘నాటు నాటు’ (Naatu Naatu) హాలీవుడ్ సాంగ్స్ తో పోటీ పడుతూ.. బెస్ట్ సౌండ్ ట్రాక్ క్యాటగిరీలో నామినేషన్స్ నిలిచింది. ఈ అవార్డులు నవంబర్ లో ప్రకటిస్తారు. మరి రామ్ చరణ్, RRR, నాటు నాటుకి అవార్డులు వరిస్తాయా..? లేదా..? చూడాలి. కాగా రామ్ చరణ్ అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. నేషనల్ అవార్డు మిస్ అయినా.. ఇలా ఇంటర్నేషనల్ అవార్డు నామినేషన్స్ లో స్థానం దక్కించుకోవడం అందర్నీ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది.