Allu Arjun : ఈ విషయంలో కూడా అల్లు అర్జున్ మొదటివాడట.. అది ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఫస్ట్ బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డుని అందుకొని హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ తాజాగా..

Allu Arjun : ఈ విషయంలో కూడా అల్లు అర్జున్ మొదటివాడట.. అది ఏంటో తెలుసా..?

Pushpa 2 star Allu Arjun is the first hero instagram making special video

Updated On : August 30, 2023 / 11:46 AM IST

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డులు సృష్టించడం ఇంకా కొనసాగుతూనే ఉంది. పుష్ప వంటి ఒక రీజినల్ సినిమాతో ఇండియా వైడ్ ప్రభంజనం సృష్టించడమే కాకుండా టాలీవుడ్ ఫస్ట్ బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డుని కూడా అందుకొని హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక తాజాగా అల్లు అర్జున్ మరో రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకున్నట్లు అభిమానులు చెబుతున్నారు. నేడు సంథింగ్ స్పెషల్ అంటూ బన్నీ పుష్ప 2 (Pushpa 2) సెట్స్ నుంచి ఒక వీడియోని షేర్ చేసిన విషయం తెలిసిందే.

Bedurulanka 2012 : చాలా ఏళ్ళ తరువాత ‘బెదురులంక’తో ఆ మాట విన్న కార్తికేయ.. ఏంటి ఆ మాట..?

ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు ప్రత్యేకంగా షూట్ చేసి తమ అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఇలా ఇన్‌స్టాగ్రామ్ టీం ఇండియాలో ఒక నటుడుకి సంబంధించి ప్రత్యేక వీడియోలు తీయడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటి వీడియోలు కోసం ఏ ఇండియన్ యాక్టర్ ని సంప్రదించలేదు. ఇక ఈ అవకాశం అందుకున్న మొదటి ఇండియన్ మూవీ స్టార్ అల్లు అర్జున్ అని చెబుతూ బన్నీ అభిమానులు నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ పేజీ ఫాలో అవుతున్న మొదటి ఇండియన్ స్టార్ కూడా బన్నీనే అంట. ఏదేమైనా అల్లు అర్జున్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకుపోతున్నాడు.

Vijay Deverakonda : ఈ పరిచయం ప్రత్యేకం.. విజయ్ దేవరకొండ పోస్ట్ ఆమె గురించేనా..?

కాగా ఆ స్పెషల్ వీడియోలో అల్లు అర్జున్.. మార్నింగ్ తన డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి తన లైఫ్ స్టైల్, పుష్ప 2 సెట్స్ లో షూటింగ్, ఆ లొకేషన్స్, మేకప్ అండ్ వెపన్స్ ఇలా ఎన్నో విషయాలను బన్నీ అభిమానులకు చూపించాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక పుష్ప టీం కూడా వరుస ప్రమోషన్స్ తో సందడి చేయనుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 22న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Instagram (@instagram)