Site icon 10TV Telugu

Ram Charan Vs Nani : నాని ‘ప్యారడైజ్’ వర్సెస్ రామ్ చరణ్ ‘పెద్ది’.. వచ్చే శ్రీరామ నవమికి బాక్సాఫీస్ ఫైట్..

Ram Charan Peddi and Nani The Paradise Movie Fight at Box office on Same Day

Ram Charan Peddi and Nani The Paradise Movie Fight at Box office on Same Day

Ram Charan Vs Nani : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా నుంచి నేడు శ్రీరామ నవమి సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. పెద్ది సినిమాని వచ్చే సంవత్సరం శ్రీరామ నవమికి 2026 మార్చ్ 26న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

గేమ్ ఛేంజర్ అంతగా ఆడకపోవడంతో ఆ సినిమా తర్వాత వస్తున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తయింది. పాటలు కూడా రెడీ చేసేసారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే రామ్ చరణ్ సినిమా నాని సినిమా పోటీ పడనున్నాయి.

Also Read : Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్..

నాని ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. త్వరలో హిట్ 3 సినిమాతో రానున్నాడు. దసరా ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో నాని ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఇది కూడా రా & రస్టిక్ లా ఉండనుంది. అయితే ప్యారడైజ్ సినిమా కూడా వచ్చే శ్రీరామనవమి 2026 మార్చ్ 26 న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

పెద్ది, ది ప్యారడైజ్ రెండు సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు మాస్ సినిమాలు వచ్చే శ్రీరామ నవమికి పోటీ పడనున్నాయి. మరి నాని, రామ్ చరణ్ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతాయా? అప్పటికి ఇద్దరిలో ఎవరైనా వాయిదా వేసుకుంటారా చూడాలి.

 

Exit mobile version