Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్..
తాజాగా నేడు శ్రీరామ నవమి సందర్భంగా పెద్ది సినిమా నుంచి ఫస్ట్ షాట్ అని గ్లింప్స్ రిలీజ్ చేసారు.

Ram Charan Janhvi Kapoor Peddi Movie Glimpse Released Release Date Also Announced
Peddi : రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తయింది. పాటలు కూడా రెడీ చేసేసారు. ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు పెద్ది ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా చరణ్ మాస్ రా & రస్టిక్ లుక్ చూసి ఫ్యాన్స్ ఈ సినిమాపై మరిన్ని హైప్స్ పెంచుకున్నారు.
Also See : Arjun S/O Vyjayanthi : ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ శ్రీరామ నవమి స్పెషల్ ఇంటర్వ్యూ చూశారా..?
తాజాగా నేడు శ్రీరామ నవమి సందర్భంగా పెద్ది సినిమా నుంచి ఫస్ట్ షాట్ అని గ్లింప్స్ రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ గ్లింప్స్ చూసేయండి..
ఇక ఈ గ్లింప్స్ లో.. ఒకే పని చేసేనాకి, ఒకేలా బతికేనాకి ఇంత పెద్ద బతుకు ఎందుకు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసెయ్యాల. పుడతామా ఏంటి మళ్ళీ అంటూ చరణ్ వాయిస్ తో డిఫరెంట్ స్లాంగ్ లో డైలాగ్ అదరగొట్టారు. ఈ సినిమా ఊళ్ళో క్రికెట్ పోటీల మీద ఉండబోతున్నట్టు తెలుస్తుంది. గ్లింప్స్ లో రామ్ చరణ్ బ్యాట్ పట్టుకొని అదిరిపోయే షాట్ కొట్టాడు. రామ్ చరణ్ మాస్ లుక్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇక ఈ సినిమాని వచ్చే సంవత్సరం మార్చ్ 26 రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం శ్రీరామ నవమికి సినిమా రిలీజ్ అవ్వనుంది. ప్రస్తుతం పెద్ది సినిమా శరవేగంగా సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ గ్లింప్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.