Priyanka Chopra : మహేష్ తర్వాత అల్లు అర్జున్ తో.. హాలీవుడ్ ని వదిలేసి టాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న ప్రియాంక చోప్రా..?

అసలు బాలీవుడ్ సినిమాలే చేయని ప్రియాంక రాజమౌళి సినిమాకి ఓకే చెప్పి చేస్తుండటంతో అంతా ఆశ్చర్యపోయారు.

Priyanka Chopra : మహేష్ తర్వాత అల్లు అర్జున్ తో.. హాలీవుడ్ ని వదిలేసి టాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న ప్రియాంక చోప్రా..?

Priyanka Chopra Doing Allu Arjun film After Rajamouli Mahesh Babu Movie Rumors goes Viral

Updated On : April 6, 2025 / 9:07 AM IST

Priyanka Chopra : 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ అయిన ప్రియాంక చోప్రా ఆ తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అక్కడ్నుంచి హాలీవుడ్ కి వెళ్లి వరుస హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అక్కడే హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. హాలీవుడ్ కి వెళ్లిన ప్రియాంక చోప్రా బాలీవుడ్ సినిమాలు ఆపేసింది. ఇండియాకు రావడం కూడా తగ్గించేసింది.

కానీ ఇప్పుడు హాలీవుడ్ స్టార్ అవుతున్న ప్రియాంక చోప్రాని రాజమౌళి ఇండియాకు తీసుకొచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో చేస్తున్న సినిమాలో ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా తీసుకున్నారు. RRR తర్వాత రాజమౌళి స్థాయి హాలీవుడ్ కి వెళ్లి పాన్ వరల్డ్ రేంజ్ కి మారింది. దీంతో మహేష్ బాబు సినిమాని గ్రాండ్ గా ప్లాన్ చేసి పాన్ వరల్డ్ రిలీజ్ చేయాలనుకున్నాడు. అందుకే ప్రియాంక అయితే హాలీవుడ్ మార్కెట్ కి కూడా ఉపయోగపడుతుంది, ఇండియన్ రూట్స్ ఉన్నాయి అని తీసుకున్నాడు రాజమౌళి.

Also Read : Ashu Reddy : తన బ్రేకప్ గురించి చెప్పిన అషు రెడ్డి.. ఆ రోజు నేను వెళ్లకుండా ఉంటే బాగుండు.. డిప్రెషన్ కి వెళ్ళిపోయాను..

అసలు బాలీవుడ్ సినిమాలే చేయని ప్రియాంక రాజమౌళి సినిమాకి ఓకే చెప్పి చేస్తుండటంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ప్రియాంక ఇప్పుడు మరో తెలుగు సినిమాకి ఓకే చెప్పింది అని వినిపిస్తుంది. ఇటీవలే పుష్ప 2 సినిమాతో భారీ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా తమిళ్ డైరెక్టర్ అట్లీతో ఉంటుందని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందని టాక్ నడుస్తుంది.

అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు, వేరే దేశాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ సినిమాలు అంటే అందరికి ఆసక్తి పెరిగింది. అట్లీ కూడా వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్నాడు. ప్రియాంక అడిగినంత రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ చూసుకొని ప్రియాంక చోప్రా అల్లు అర్జున్ సినిమాకి ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఒకవేళ ఇదే నిజమైతే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లిన స్టార్ హీరోయిన్ ప్రియాంక ని ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ టాలీవుడ్ కి తీసుకొస్తున్నారు.