Ram charan Peddi movie climax shooting started
Peddi Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్నాడు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పెద్ది సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అందుకు తగ్గట్టుగానే, మేకర్స్ ఈ సినిమాను ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నారు. ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. గేమ్ ఛేంజర్ తో డిజప్పాయింట్ అయిన తన ఫ్యాన్స్ పెద్ది(Peddi Update) సినిమాతో కాలర్ ఎగరేసుకునేలా చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Mana ShankaraVaraprasad garu: మన శంకరవరప్రసాద్ గారు మూవీ చూసిన రామ్ చరణ్.. ఫొటోలు
చికిరి సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. తాజాగా పెద్ది సినిమా భారీ క్లైమాక్స్ షూటింగ్ కూడా ప్రారంభించారట. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చరణ్‌తో పాటు ప్రధాన పత్రాలపై యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు.
ఇక ఇప్పటికే పెద్ది సినిమా ఫస్ట్ హాఫ్ కట్ సిద్ధమైందని సమాచారం. ప్రస్తుతం సెకండాఫ్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. అనుకున్న తేదీకి అనుకున్నట్టుగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే పెద్ది సినిమా నుంచి రెండో పాటను కూడా విడుదల కానుందట. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.