Ram Charan Performed Chiranjeevi Veena Step in Game Changer Movie Song
Ram Charan – Chiranjeevi : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మూవీ యూనిట్ ఇటీవల యాక్టివ్ అయి వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. నిన్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రా మచ్చ మచ్చ.. అంటూ మంచి మాస్ సాంగ్ వచ్చి బాగా వైరల్ అయింది.
అయితే ఈ సాంగ్ చూసిన తరవాత ఈ సాంగ్ లో రామ్ చరణ్ వీణ స్టెప్ వేయబోతున్నాడని అర్ధమవుతుంది. అలాగే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కటౌట్స్ తో కూడా సాంగ్ లో సందడి చేసారు. చరణ్ వీణ స్టెప్ వేయడం చూపించకపోయినా ఒక ఫోటో మాత్రం ఈ లిరికల్ సాంగ్ లో చూపించారు. దీంతో రామ్ చరణ్ తన తండ్రి ఫేమస్ వీణ స్టెప్ ఎలా వేస్తాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాలో కూడా చిరంజీవి రిఫరెన్స్ లు మరిన్ని ఉండబోతున్నట్టు సమాచారం.
దీంతో ఓ పక్క చరణ్ వీణ స్టెప్, మరో పక్క చిరంజీవి రిఫరెన్స్ లతో గేమ్ ఛేంజర్ సినిమా మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాలో వేసిన వీణ స్టెప్ ఏ రేంజ్ లో పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఆ స్టెప్ కి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అభిమానులే. ఎంతోమంది మెగా అభిమానులు ఇప్పటికి చిరంజీవి వీణ స్టెప్స్ వేసి సంబరపడుతుంటారు.