Allu Arjun – Sneha : ఫ్యామిలీతో గోవాలో చిల్ అవుతున్న అల్లు అర్జున్.. స్నేహ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా..?
గోవాలో తన భార్య స్నేహ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు బన్నీ.

Allu Arjun Celebrates his wife Allu Sneha Reddy Birthday in Goa enjoying with Family
Allu Arjun – Sneha : ఇటీవల సెప్టెంబర్ 29న అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి పుట్టిన రోజు. ఆ రోజు బన్నీ తన భార్య ఫొటోలు షేర్ చేసి స్పెషల్ విషెష్ తెలిపాడు. అయితే స్నేహ పుట్టిన రోజు గోవాలో సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి గోవాకు వెళ్లారు.
గోవాలో తన భార్య స్నేహ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు బన్నీ. పలువురు బన్నీ, స్నేహ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా పాల్గొన్నారు.
తన భార్యతో కేక్స్ కట్ చేయించి, అందరూ కలిసి డిన్నర్ పార్టీ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు అల్లు స్నేహారెడ్డి గోవాలో తన బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించి పలు ఫొటోలు షేర్ చేసింది.
ప్రస్తుతం బన్నీ తన భార్య, పిల్లలతో గోవాలో చిల్ అవుతున్నాడు. త్వరలోనే మళ్ళీ పుష్ప 2 షూటింగ్ లో పాల్గొననున్నాడు అల్లు అర్జున్.