Ram Charan phone call with pawan kalyan in unstoppable show
Ram Charan : ఆహా అన్‌స్టాపబుల్ టాక్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. మొదటి సీజన్ సూపర్ హిట్టు అవ్వడంతో, సెకండ్ సీజన్ ని స్టార్ట్ చేశాడు బాలయ్య. ఇది కూడా సూపర్ డూపర్ హిట్టుగా నిలుస్తుంది. ఈ సీజన్ మొత్తాన్ని అదిరిపోయే అతిధిలతో డిజైన్ చేసిన ఆహా టీం.. ఎండింగ్ ని కూడా అదే రీతిలో ప్లాన్ చేశారు. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ని లాస్ట్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా తీసుకువచ్చి సంచలనం సృష్టించారు.
Pawan – Balayya : పవన్‌ని ‘భయ్యా’ అని పిలిచిన బాలయ్య.. అన్‌స్టాపబుల్!
ఈ ఎపిసోడ్ షూటింగ్ నిన్న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుపుకోగా.. మెగా, నందమూరి అభిమానులు స్టూడియో వద్దకి చేరుకొని సందడి చేశారు. అయితే ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌ని ఏమి అడుగుతాడు అనేదే అందరిలో ఆశక్తిని రేపుతోంది. కాగా ఈ ఎపిసోడ్‌లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా భాగం పంచుకున్నారని తెలుస్తుంది.
సాయిధరమ్ తేజ్ స్టూడియోకి రాగా, రామ్ చరణ్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడాడు. బాలకృష్ణ తన ఫోన్ నుంచి చరణ్ కి ఫోన్ చేసి బాబాయ్ పవన్‌తో మాట్లాడించినట్లు సమాచారం. అలాగే సాయిధరమ్, చరణ్.. ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని పవన్‌ని బాలయ్య అడిగాడట. మరి ఈ ప్రశ్నకి పవన్ జవాబు ఏంటి అనేది ఎపిసోడ్ విడుదలయ్యాకే తెలుసుకోవాలి. కాగా ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్ లో కూడా బాలకృష్ణ రామ్ చరణ్ కి ఫోన్ కాల్ చేసిన సంగతి తెలిసిందే.