Ram Charan : బ్యాంకాక్ వెకేషన్ నుంచి వచ్చిన రామ్ చరణ్.. మళ్ళీ ‘గేమ్ ఛేంజర్’ షూట్ మొదలు.. ఎప్పుడు? ఎక్కడ అంటే..?

తాజాగా రామ్ చరణ్ బ్యాంకాక్ వెకేషన్ నుంచి హైదరాబాద్ కి తిరిగొచ్చారు.

Ram Charan Return to Hyderabad from Bangkok Vacation will Join Game Changer Shoot in Soon

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఉపాసన, తన కూతురు, తన కుక్కపిల్ల రైమ్ తో కలిసి వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. సమ్మర్ మొదట్లోనే చరణ్ ఫ్యామిలీతో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్ తో బ్యాంకాక్ కి వెళ్లి ఎంజాయ్ చేసొచ్చారు. చరణ్ బ్యాంకాక్ వెళ్లిన విజువల్స్, అక్కడ నుంచి షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా రామ్ చరణ్ బ్యాంకాక్ వెకేషన్ నుంచి హైదరాబాద్ కి తిరిగొచ్చారు. నిన్న రాత్రి చరణ్ హైదరాబాద్ కి తిరిగిరాగా ఎయిర్ పోర్ట్‌లో చరణ్ ఫ్యామిలీ విజువల్స్ వైరల్ గా మారాయి. త్వరలోనే చరణ్ మళ్ళీ గేమ్ ఛేంజర్ షూట్ లో పాల్గొనబోతున్నారు. ఇటీవల దిల్ రాజు ఓ ప్రెస్ మీట్ లో గేమ్ ఛేంజర్(Game Changer) షూట్ ఇంకా రెండు నెలలు పడుతుందని చెప్పారు. కొన్ని రోజుల క్రితమే వైజాగ్ లో గేమ్ ఛేంజర్ షూట్ జరిగిన సంగతి తెలిసిందే.

Also Read : Mrunal Thakur : ‘సీతారామం’ తర్వాత తెలుగు సినిమాలు చేయొద్దు అనుకున్నాను.. ఏడ్చేసాను.. మృణాల్ సంచలన వ్యాఖ్యలు..

త్వరలో ఏప్రిల్ 20 నుంచి మళ్ళీ గేమ్ ఛేంజర్ షూట్ జరగనున్నట్టు సమాచారం. ఈసారి రాజమండ్రిలో దాదాపు 10 రోజుల పాటు షూటింగ్ జరగనుందని తెలుస్తుంది. గతంలో కూడా రాజమండ్రిలో షూటింగ్ చేసినప్పుడు రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ పాత్రలో షూటింగ్ చేసినట్టు కొన్ని ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి అక్కడే షూటింగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి జరగండి.. జరగండి.. సాంగ్ రిలీజ్ అయి వైరల్ అయిన సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమా దీపావళికి రిలీజ్ చేస్తారని సమాచారం.