Mrunal Thakur : ‘సీతారామం’ తర్వాత తెలుగు సినిమాలు చేయొద్దు అనుకున్నాను.. ఏడ్చేసాను.. మృణాల్ సంచలన వ్యాఖ్యలు..
ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ ఠాకూర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Mrunal Thakur Sensational Comments on Telugu Language and Movies
Mrunal Thakur : ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో మృణాల్ ఠాకూర్ ఒకరు. బాలీవుడ్ టీవీ పరిశ్రమ ద్వారా ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చినా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సీతారామం సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. సీతారామం సినిమా మృణాల్ ఠాకూర్ ని ఓవర్ నైట్ స్టార్ చేసేసింది. ఆ సినిమా తర్వాత మృణాల్ కి తెలుగు, బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడం, స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకోవడం జరిగాయి.
తాజాగా మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఈ సినిమాలో మృణాల్ ఇందు అనే పాత్రలో మెప్పించింది. దీనికి ముందు హాయ్ నాన్న సినిమాలో యష్ణ పాత్రలో అదరగొట్టింది. అయితే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ ఠాకూర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read : Pushpa 2 : పుష్ప విలన్లంతా ఒకేచోట.. పార్ట్ 2లో సుక్కు మాస్టర్ ఏం ప్లాన్ చేస్తున్నాడో..?
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. నాకు భాష రాకపోతే అక్కడ ఉండటం చాలా కష్టం. సీతారామం సినిమాలో తెలుగు భాష రాక చాలా ఇబ్బంది పడ్డాను. నాకు కేవలం హిందీ, మరాఠి మాత్రమే వచ్చు. తెలుగు భాష నాకు చాలా కష్టంగా అనిపించేది. నేర్చుకుందామని ట్రై చేసినా రాలేదు. ఆ షూటింగ్ టైంలో భాషతో ఇబ్బందులు పడి ఏడ్చేసాను కూడా. ఇక తెలుగులో సీతారామం తర్వాత మళ్ళీ సినిమాలు చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను. సీతారామం షూటింగ్ కశ్మీర్ లో జరిగేటప్పుడు దుల్కర్ సల్మాన్ కి ఇదే నా ఫస్ట్ & లాస్ట్ తెలుగు సినిమా అని, ఇకపై తెలుగులో సినిమాలు చేయనని చెప్పాను. అప్పుడు దుల్కర్ నాకు ధైర్యం ఇచ్చాడు. ఇప్పుడు తమిళ్, కన్నడలో కూడా సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను అంటే దుల్కర్ వల్లే అని తెలిపింది. దీంతో మృణాల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇక హాయ్ నాన్న సినిమా సమయంలో మృణాల్ కష్టపడి తెలుగు నేర్చుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో కూడా తెలుగు కొంచెం కొంచెం మాట్లాడుతుంది. తర్వాత రాబోయే తెలుగు సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటానని ఇటీవల తెలిపింది మృణాల్.