Pushpa 2 : పుష్ప విలన్లంతా ఒకేచోట.. పార్ట్ 2లో సుక్కు మాస్టర్ ఏం ప్లాన్ చేస్తున్నాడో..?

నటుడు బ్రహ్మాజీ పుష్ప 2 వర్క్ షాప్ నుంచి ఓ ఫోటో షేర్ చేశాడు.

Pushpa 2 : పుష్ప విలన్లంతా ఒకేచోట.. పార్ట్ 2లో సుక్కు మాస్టర్ ఏం ప్లాన్ చేస్తున్నాడో..?

Brahmaji Shares Anasuya Fahadh Faasil Sunil Sukumar Combo photo from Pushpa 2 Work Shop

Updated On : April 7, 2024 / 8:50 AM IST

Pushpa 2 : అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప 1తో నేషనల్ వైడ్ గుర్తింపు, పాటలు, సాంగ్స్ తో ఇంటర్నేషనల్ వైరల్, నేషనల్ అవార్డు.. ఇలా బాగా పాపులర్ అయిపోయాడు అల్లు అర్జున్. దీంతో పార్ట్ 2 కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 సినిమా ఆల్రెడీ ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ఇక పుష్ప 2 టీజర్ అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు రేపు ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు పుష్ప టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక మరో పక్క పుష్ప 2 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. తాజాగా పుష్ప 2 మూవీ యూనిట్ నుంచి ఓ ఫోటో వైరల్ అవుతుంది. నటుడు బ్రహ్మాజీ పుష్ప 2 వర్క్ షాప్ నుంచి ఓ ఫోటో షేర్ చేశాడు.

Also Read : Bahumukham Review : ‘బహుముఖం’ మూవీ రివ్యూ.. అమెరికాలో తీసిన సస్పెన్స్ సైకో థ్రిల్లర్ సినిమా..

ఈ ఫొటోలో బ్రహ్మాజీతో పాటు ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, డైరెక్టర్ సుకుమార్(Sukumar) ఉన్నారు. ఫహద్, సునీల్, అనసూయ.. వీళ్లంతా పుష్పలో విలన్లుగా నటించిన సంగతి తెలిసిందే. వీళ్ళందర్నీ ఒకేచోటకి తీసుకొచ్చి సుకుమార్ వర్క్ షాప్ చేయిస్తున్నాడంటే విలన్లందరితో కలిసి ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు, సినిమాలో సీన్స్ హైలెట్ ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు. సినిమాలో అల్లు అర్జున్ ని ఎదుర్కోవడానికి విలన్లంతా ఒక్కటవుతారా? అనే సందేహాన్ని కూడా కలిగిస్తున్నారు ఈ ఫొటోతో. దీంతో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.