‘ఆచార్య’లో అగ్రెసివ్ స్టూడెంట్ లీడర్‌గా చరణ్..
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆచార్య’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న క్యారెక్టర్ గురించి ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రామ్‌చరణ్ లేదా మరెవరైనా ప్రముఖ హీరో నటించనున్నారని ముందు నుంచి వార్తలు వినపడుతున్నాయి. మెగాస్టార్‌తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి తెరపంచుకోవడం ఖాయమైపోయిందన్నారు. కట్ చేస్తే చెర్రీ లైన్లోకి వచ్చాడు. ఈ సినిమాలో చరణ్ ఓ కీలక ఎపిసోడ్‌లో కనిపించనున్నాడు.
ఈ చిత్రంలో చరణ్ క్యారెక్టర్ సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతుందట. మెగా పవర్ స్టార్ ఈ సినిమాలో అగ్రెసివ్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నాడని దాదాపు 30 నిమిషాల పాటు సాగే ఈ క్యారెక్టర్ కథను మలుపుతిప్పుతుందని తెలుస్తోంది. చెర్రీ సరసన ఓ యువ కథానాయిక నటించనుందని, చిరు, చరణ్ ఓ పాటలో కలిసి కనిపించనున్నారని సమాచారం.
Read Also : ‘మనంసైతం’కు రూ.5 లక్షలు అందజేసిన దర్శకుడు