Ram Charan said his Favourite Movies list in a hollywood interview that movies goes viral
Ram Charan Favourite Movies : RRR సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. విదేశాల్లో ఎక్కడికి వెళ్లినా వీళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. వీరితో ఫోటోలు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ ల కోసం విదేశాల్లో జనాలు కూడా ఎగబడుతున్నారు. ప్రస్తుతం RRR యూనిట్ అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆస్కార్ వేడుకలు ఉండటంతో పాటు అమెరికాలో RRR సినిమా రీ రిలీజ్ ఉండటంతో చిత్ర యూనిట్ అంతా అమెరికాలోనే ఉంటూ సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రామ్ చరణ్ హాలీవుడ్ లోని పలు సంస్థలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ మరింత పాపులర్ అవుతున్నాడు. హాలీవుడ్ ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ RRR గురించి, ఇండియన్ సినిమా గురించి, తన పర్సనల్ విషయాలు కూడా పంచుకుంటున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన ఫేవరేట్ ఇండియన్, హాలీవుడ్ సినిమాలని తెలిపాడు.
రామ్ చరణ్ కు హాలీవుడ్ లో.. ది నోట్ బుక్, టెర్మినేటర్ 2, గ్లాడియేటర్, ఇన్ గ్లోరియస్ బ్లాస్టర్డ్ సినిమాలు ఇష్టమని తెలిపాడు. అలాగే ఇండియన్ సినిమాల్లో.. దానవీర శూరకర్ణ, మిస్టర్ ఇండియా, బాహుబలి, రంగస్థలం సినిమాలు ఇష్టమని తెలిపాడు. దీంతో రామ్ చరణ్ హాలీవుడ్ ఫ్యాన్స్ చరణ్ చెప్పిన ఇండియన్ సినిమాల కోసం వెతుకుతుంటే, ఇక్కడి చరణ్ ఫ్యాన్స్ హాలీవుడ్ సినిమాల కోసం వెతుకుతున్నారు. మరి చరణ్ ఫేవరేట్ సినిమాలు మీరు కూడా చూశారా?