Allu Arjun : సరికొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్జున్.. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఆ రికార్డ్ సాధించింది బన్నీనే..

తాజాగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తన సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు బన్నీ. పుష్ప తర్వాత సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని ఫాలో అయ్యేవాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. దీంతో బన్నీకి.........

Allu Arjun : సరికొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్జున్.. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఆ రికార్డ్ సాధించింది బన్నీనే..

Allu Arjun Created new record as first south Indian actor reach 20 million followers in Instagram

Allu Arjun :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో భారీ విజయం సాధించి నార్త్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. పుష్ప సినిమా అనూహ్యంగా బాలీవుడ్ లో భారీ విజయం సాధించి కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం బన్నీ అభిమానులతో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.

తాజాగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తన సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు బన్నీ. పుష్ప తర్వాత సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని ఫాలో అయ్యేవాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. దీంతో బన్నీకి ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ బాగా పెరిగారు. తాజాగా అల్లు అర్జున్ ని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అయ్యేవారి సంఖ్య 20 మిలియన్స్ కి చేరుకుంది. అంటే దాదాపు 2 కోట్ల మంది అల్లు అర్జున్ ని ఫాలో అవుతున్నారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న మొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ గా రికార్డు సృష్టించాడు బన్నీ.

Pawan Kalyan : ఆ ఇద్దరు హీరోలకు సారీ చెప్పిన పవన్ కళ్యాణ్..

బన్నీ ఈ అరుదైన ఫీట్ సాధించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోకు సోషల్ మీడియాలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని పోస్టులు చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కి ట్విట్టర్లో 7.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.