మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి మల్టీస్టారర్ అంటే మెగా అభిమానులు ఎంతగానో ఆనందించే విషయం. గతంలో రామ్ చరణ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్‌లో మెరిశాడు చిరంజీవి అయితే ఇద్దరు కలిసి ఒక సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించలేదు. అయితే, సైరా సినిమా తర్వాత చిరంజీవి అదే ఊపులో తన నెక్స్ట్ సినిమా మొదలు పెట్టేశాడు. కొరటాల శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించి ఓపెనింగ్ కూడా జరిగిపోయింది.
అయితే లేటెస్ట్‌గా తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నాడట. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ సినిమా షూటింగ్‌ని మార్చి వరకు పూర్తి చేసి ఏప్రిల్ నుంచి ఈ కొరటాల సినిమాలో నటించబోతున్నారట. ఇందుకోసం 30రోజుల కాల్షీట్ కూడా రామ్ చరణ్ ఇచ్చేశాడట. అయితే చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించే సీన్లు మాత్రం సినిమాలో ఉండవని అంటున్నారు.
గతంలో సైరా మీడియా మీట్‌లో రామ్ చరణ్‌తో కలిసి నటించే సినిమా గురించి కాస్త క్లూ ఇచ్చారు చిరంజీవి. అయితే క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ విషయంలో క్లారిటీ వస్తుంది. కొరటాలతో సినిమాలో చిరంజీవి యంగర్ వెర్షన్‌లో రామ్ చరణ్ నటిస్తున్నాడు. చిరంజీవి క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ కనిపిస్తాడు. ఆ పాత్రకి లవ్ స్టోరీ కూడా ఉంటుందట. అందుకే ఆ పాత్ర వరకు చరణ్ తో చేయిస్తున్నట్లు చెబుతున్నారు.