Ram Charan: రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ ని చూశారా? ఇంటర్నేషనల్ డేంజరస్ ఫైటర్.. హిస్టరీ వింటే మైండ్ బ్లాక్ అవుద్ది!
రామ్ చరణ్ (Ram Charan)బాడీగార్డ్ కెవిన్ కుంట గురించి చాలా మందికి తెలియని విషయాలు.
- V Santhosh Kumar
- Updated on- May 25, 2026 / 07:03 PM IST
Ram charan special bodyguard kevin kunta biography viral on social media
- చరణ్ బాడీగార్డ్ ఇంటర్నేషనల్ ఫైటర్ కెవిన్
- భారీ శారీరక దారుఢ్యంతో నెటిజన్లు అవాక్
- ముంబై ఈవెంట్‌లో బీస్ట్ రేంజ్ రచ్చ
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో అత్యంత వైభవంగా జరిగింది. అయితే, ఈ వేడుకలో సినిమా విశేషాల కంటే రామ్‌చరణ్ పక్కన ‘షాడో’లా నిలిచిన ఒక భారీ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ముంబై ఎయిర్‌పోర్ట్ నుండి ఈవెంట్ ముగిసే వరకు చరణ్(Ram Charan)కు ప్రత్యేక రక్షణ కవచంలా నిలిచిన ఆ వ్యక్తి అంతర్జాతీయ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్ కెవిన్ కుంట. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో రామ్‌చరణ్ లుక్స్‌తో పాటు ఈ బాడీగార్డ్ వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
Ananth Sriram: నా తల్లిదండ్రులకు ప్రాణాహాని ఉంది.. భీమవరం కలెక్టరేట్ వేదికగా అనంత్ శ్రీరామ్ ఆవేదన!
అసలు ఎవరీ కెవిన్ కుంట అని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్, ప్రస్తుతం ఇటలీలో ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా రాణిస్తున్నాడు. అక్కడ నేషనల్ మిడిల్‌వెయిట్ MMA ఛాంపియన్‌గా నిలిచిన ఇతనికి అంతర్జాతీయ సెలబ్రిటీలు, VVIPలకు అత్యున్నత స్థాయి క్లోజ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ అందించడంలో భారీ డిమాండ్ ఉంది. రామ్‌చరణ్ ముంబైలో అడుగుపెట్టిన క్షణం నుండి మీడియా కెమెరాలన్నీ ఈ ఇంటర్నేషనల్ ఫైటర్ వైపు కూడా తిరిగాయి.
కెవిన్ కుంట భారీ శారీరక దారుఢ్యం, సిక్స్‌ప్యాక్ బాడీ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ముంబై ఈవెంట్‌లో వేలాది మంది అభిమానులు, మీడియా ప్రతినిధులు ఒకేసారి ఎగబడినప్పుడు, అతను తన పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌తో గుంపును నియంత్రించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. రామ్‌చరణ్ పక్కన ఇతను నడుచుకుంటూ వస్తుంటే ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమా సెట్ లాగా అనిపించిందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అయితే, ఈ బడీ గార్డ్ కి రోజుకి రెండు లక్షల వరకు ఇస్తున్నట్టుగా సమాచారం. మెగా అభిమానులు ఇతనికి “ది బీస్ట్” అంటూ ట్యాగ్‌లు ఇచ్చి సోషల్ మీడియాలో క్రేజీ రీల్స్‌తో రచ్చ చేస్తున్నారు.
