Ram Charan Giving RC 16 Movie Update
RC 16 : RRR సినిమా నాటు నాటు సాంగ్ ఆస్కార్ విన్నింగ్ తర్వాత చరణ్, ఉపాసన శుక్రవారం నాడు ఇండియాకు తిరిగివచ్చారు. అయితే ఢిల్లీలో నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించే దేశంలోనే అతిపెద్ద స్పీకర్ షిప్ సమ్మిట్ India Today Conclave ప్రోగ్రాంలో చరణ్ పాల్గొనబోతుండటంతో డైరెక్ట్ ఢిల్లీకే వెళ్ళాడు చరణ్. శుక్రవారం మధ్యాహ్నం ఆ కార్యక్రమంలో చరణ్ మాట్లాడి అనేక విషయాలు మీడియాతో పంచుకున్నాడు. ఈ ప్రోగ్రాంలో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చరణ్ ని ఇంటర్వ్యూ చేశారు.
ఇందులో చరణ్ ఫ్యామిలీ, సినిమా, రాజమౌళి, RRR, పర్సనల్ విషయాలు.. అనేక విషయాలు మాట్లాడాడు. ఇదే వేదికపై చరణ్ తాను చేయబోతున్న నెక్స్ట్ సినిమా గురించి కూడా చెప్పాడు. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు. ఇది అయిన తర్వాత బుచ్చిబాబు సానతో మరో క్రేజీ ప్రాజెక్టు చేయనున్నాడు. ఈ ప్రాజెక్టు గురించి చరణ్ మాట్లాడుతూ.. నా కెరీర్ లో బెస్ట్ రంగస్థలం సినిమా. ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. త్వరలో రంగస్థలం కంటే కూడా మరింత బెటర్ క్యారెక్టర్ చేయబోతున్నాను. రంగస్థలం లాగే మరో మన నేటివిటీ లాంటి ఓ మంచి సినిమా అవుతుంది. చాలా గ్రాండియర్ గా ఉండబోతుంది ఈ సినిమా. మన మట్టి గురించే చెప్పే లాంటి సినిమా. ఇది సెప్టెంబర్ లో షూట్ మొదలవ్వబోతుంది అని తెలిపాడు చరణ్.
Balagam Movie Collections : అదిరిపోయిన బలగం సినిమా కలక్షన్స్.. ఫుల్ ప్రాఫిట్స్..
ఓ పక్కన RC 15 నడుస్తుండగానే RC 16 గురించి చరణ్ అప్డేట్ ఇచ్చేసి ఇప్పట్నుంచే ఆ సినిమాపై కూడా అంచనాలు పెంచేశాడు. అడక్కుండానే అప్డేట్ ఇవ్వడంతో చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక RC 16 సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో