×
Ad

Ram Charan-Sukumar: అవేవి కాదు.. రామ్ చరణ్ సినిమానే చేస్తున్నాం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత నవీన్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం యమ స్పీడ్ లో ఉన్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ ని(Ram Charan-Sukumar) ఖుషీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దానికి కారణం గేమ్ ఛేంజర్ ప్లాప్.

Ram Charan-Sukumar movie to start shooting in April

Ram Charan-Sukumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం యమ స్పీడ్ లో ఉన్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ ని ఖుషీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దానికి కారణం గేమ్ ఛేంజర్ ప్లాప్. ఈ సినిమా తరువాత మెగా ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది ఈ సినిమా. దీంతో, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. వరుసగా భారీ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇందులో భాగంగా(Ram Charan-Sukumar) ఇప్పటికే పెద్ది సినిమాను స్టార్ట్ చేశాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Peddi: పెద్ది సినిమా సాంగ్ షూటింగ్.. ఈ ఒక్క వీడియో చాలు.. రామ్ చరణ్ ఎంతలా కష్టపడుతున్నాడో చెప్పడానికి..

ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఎన్నడూ లేని విదంగా సినిమా గురించి మాట్లాడుతూ అంచనాలను పెంచేస్తున్నాడు. ఎలాగైనా సినిమాను హిట్ అయ్యేలా చేసి తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమా తరువాత కూడా రామ్ చరణ్ అదే రేంజ్ లో ఉండేలా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా మరేదో కాదు సుకుమార్ తో చేయబోయే సినిమా. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దీంతో, ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా అని రామ్ చరణ్ ఫ్యాన్ వెయిట్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి ఒక కీలక అప్డేట్ ఇచ్చారు నిర్మాత నవీన్. రామ్ చరణ్-సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ భారీ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సంస్థ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత నవీన్ మాట్లాడుతూ.. “సుకుమార్ గారి నెక్స్ట్ సినిమా పుష్ప 3 కాదు. రామ్ చరణ్ గారితో ఉంటుంది. పెద్ది సినిమా కంఫ్లీట్ అయిన వెంటనే చరణ్ గారి సినిమా షాట్ స్టార్ట్ అవుతుంది. అది కూడా వచ్చే ఏడాది ఎప్రిల్, మే లో స్టార్ట్ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ న్యూస్ తెలిసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి గతంలో ఈ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.